Gold rate: పసిడి పరుగుకు నో బ్రేక్స్..2 లక్షలు దాటేస్తుందా ?

Gold rate: 1975లో తులం బంగారం ధర రూ.540, 1980లో 1,330, 1990లో 3,200గా ఉంది. 2000లో తులం 4,400 ఉంటే... 2005లో ఏడు వేలు అయింది. అంటే రెట్టింపుకు ఒక్క వెయ్యి తక్కువ.

Gold rate

బంగారం త్వరలోనే రెండు లక్షలు దాటేస్తుందా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే అవుననే అంటున్నారు నిపుణులు.. ఇప్పటికే గోల్డ్ లక్షన్నర దగ్గరకి వచ్చేసింది. ఎంత వీలయితే అంత ఇప్పుడే కొనుగోలు చేయమంటున్నారు. మంచి తరుణం మించినా దొరకదంటూ సలహా ఇస్తున్నారు.పాతికేళ్ల కింద తులం బంగారం 4 వేలు. ఇప్పుడు లక్షా 35 వేలు. ఏకంగా లక్షా 31వేలు పెరిగిందన్న మాట. అప్పుడు నాలుగుతులాలు కొని పెట్టుకున్నా…ఇప్పుడు 6 లక్షలు అయ్యేది. ఎందుకంటే ఆ స్థాయిలో బంగారం ధర (Gold rate)పెరుగుతోంది.

ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా ? ఈ ఏడాది చివరి నాటికి లక్షణంగా లక్షన్నర దాటేస్తుందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో రెండేళ్లలోనే 2 లక్షలు దాటేస్తుందని అంటున్నారు. 2020లో (Gold rate)తులం 48 వేల 650 పలికింది. ఇప్పుడు లక్షన్నరకు దగ్గరలో ఉంది. అంటే 5 ఐదేళ్లలో ఊహించని విధంగా పెరిగిపోయింది. ఇలా చూసినా అతి త్వరలోనే లక్షన్నర కావడం ఎంతో దూరంలో లేదని నిపుణులు చెబుతున్నారు.

Gold rate

స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారంతా…ఇప్పుడు పుత్తడికి జైకొడుతున్నారు. అమెరికా షట్‌డౌన్‌ ఎత్తివేతపై అనిశ్చితి, యూఎస్‌-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు వంటి పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలోనే గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు గిరాకీ విపరీతంగా ఉంటోంది.

1975లో తులం బంగారం ధర రూ.540, 1980లో 1,330, 1990లో 3,200గా ఉంది. 2000లో తులం 4,400 ఉంటే… 2005లో ఏడు వేలు అయింది. అంటే రెట్టింపుకు ఒక్క వెయ్యి తక్కువ. 2010 నాటికి 18వేల 5 వందలు అయింది.ఈ పదేళ్ల గ్యాప్‌లోలో తులంపై 14 వేలు పెరిగింది. 2015 వరకు పదిగ్రాములు 26 వేల 3 వందల 43 అయింది. ఈ ఐదేళ్లలో కూడా గ్రోత్ ఎక్కువగానే ఉంది. 2020 సంవత్సరానికి తులం 48 వేల 650కి చేరింది.

ఈ ఐదేళ్ల లో దాదాపు డబుల్ అయింది. 2021లో 50 వేల 45 రూపాయలు, 2022లో 52 వేల 9వందల 50, 2023లో 60వేల 3వందలు, 2024లో 78 వేలు అయింది. జెట్ స్పీడ్‌తో గోల్డ్ రన్ కొనసాగింది. 2025 సెప్టెంబరు 23 నాటికి లక్షా 19వేలకు చేరింది. అక్టోబరులో దాని ధర…లక్షా 35వేల 250గా ఉంది. 25 ఏళ్లలోనే బంగారం ఎంత పెరిగిందో తెలుసా..లక్షా 21 వేలకు పైగా హైక్ అయింది. ఎందులో ఇన్వెస్ట్ మెంట్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది. గోల్డ్ తప్ప ఏది కొన్నా..ఈ స్థాయిలో రాబడి వుండదు. అందుకే మీరూ ఇంకో ఆలోచన చేయకండి..చేతిలో డబ్బు ఉంటే వెంటనే గోల్డ్ కొనేయడం బెటర్ అంటున్నారు.

Lokesh: అక్టోబర్ 19 నుంచి 24 వరకు.. సిడ్నీ, బ్రిస్బేన్, మెల్‌బోర్న్‌లో లోకేష్ బిజీ షెడ్యూల్

Exit mobile version