Vishnu Sahasranamam
హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన స్తోత్రాలలో విష్ణు సహస్రనామం ఒకటి అని పండితులు చెబుతారు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత, అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు.. ధర్మరాజుకు ఉపదేశించిన పరమ పవిత్రమైన నామాలు .. విష్ణు సహస్రనామాలు.
ప్రతీ రోజూ విష్ణు సహస్రనామ(Vishnu Sahasranamam) పారాయణ కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాకుండా.. భౌతిక, మానసిక సమస్యలను కూడా తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజు దీనిని పఠించడం లేదంటే వినడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని అంటున్నారు.
విష్ణు సహస్రనామ పారాయణ వల్ల కలిగే మొదటి ఫలితం.. మానసిక ప్రశాంతత. నిరంతరం ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారు రోజూ ఈ నామాలను వినడం వల్ల మనసు నిలకడగా మారుతుందట. లోకంలో ఎదురయ్యే గ్రహ దోషాలు, జాతక రీత్యా ఉన్న అరిష్టాలు ఈ స్తోత్ర పఠనం వల్ల తొలగిపోతాయట.
విష్ణువు అంటే సర్వాంతర్యామి, ఆయనకున్న వెయ్యి నామాలను స్మరించడం వల్ల మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందట. దీనివల్లే మనలో భయం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కుటుంబంలో ఐకమత్యం లేని వారు, సంతాన సమస్యలతో బాధపడే వారు ఈ పారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
ఆరోగ్యపరంగా కూడా విష్ణు సహస్రనామానికి గొప్ప శక్తి ఉందని వేద పండితులు చెబుతారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు భక్తితో ఈ నామాలను వింటే వ్యాధి తీవ్రత తగ్గుతుందని అంటారు. దీనిలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం లాగా పని చేసి మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది.
సంపద , ఐశ్వర్యం కావాలనుకునే వారు, విద్యార్థులు ఏకాగ్రత కోసం దీనిని పారాయణ చేయడం చాలా మంచిది. కేవలం చదవడమే కాకుండా, కనీసం వినడం వల్ల కూడా పూర్తి ఫలితం దక్కుతుంది. భీష్మ ఏకాదశి రోజు సామూహిక విష్ణు సహస్రనామ(Vishnu Sahasranamam) పారాయణలో పాల్గొనడం వల్ల దేశంలో ప్రతి ఒక్కరికీ కూడా మేలు జరుగుతుందని పురాణాలు చెబుతాయి.
YS Jagan : వైఎస్ జగన్ కీలక నిర్ణయం..పాదయాత్రపై సంచలన ప్రకటన
