YouTube: యూట్యూబ్‌లో డబ్బు సంపాదించడం ఎలా?

YouTube: మీకు ఆసక్తి ఉన్న,మీకు నైపుణ్యం ఉన్న అంశాన్ని ఎంచుకుంటే, మీరు కంటెంట్ క్రియేట్ చేయడాన్ని ఆస్వాదిస్తారు.

YouTube

ప్రస్తుతం యూట్యూబ్(YouTube) కేవలం వీడియోలు చూసే వేదిక మాత్రమే కాదు, లక్షలాది మందికి ఆదాయ వనరుగా మారింది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా మారి డబ్బు సంపాదించడం ఒక కలలా అనిపించవచ్చు. కానీ, దీనికి సరైన ప్రణాళిక, కష్టపడేత్వం, పట్టుదల, క్రియేటివిటీ ఉంటే ఆ కలను సాకారం చేసుకోవచ్చు.

మీరు యూట్యూబ్(YouTube) ఛానెల్ ప్రారంభించాలనుకుంటే, మొదట మీరు ఏ అంశంపై కంటెంట్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. టెక్నాలజీ, వంటలు, కామెడీ, విద్య, గేమింగ్, ఫ్యాషన్, లేదా ట్రావెల్ వంటి అనేక అంశాలు ఉన్నాయి. మీకు ఆసక్తి ఉన్న,మీకు నైపుణ్యం ఉన్న అంశాన్ని ఎంచుకుంటే, మీరు కంటెంట్ క్రియేట్ చేయడాన్ని ఆస్వాదిస్తారు. మీ కంటెంట్ ప్రత్యేకంగా, నాణ్యంగా ఉంటేనే ప్రేక్షకులు ఆకర్షితులవుతారు.

యూట్యూబ్‌లో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ముఖ్యమైనవి గుర్తు పెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు.
యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YouTube Partner Program).. మీ ఛానెల్‌కు 1000 సబ్‌స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ టైమ్ ఉంటే, మీరు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు అవుతారు. దీని ద్వారా మీ వీడియోలలో ప్రకటనలు చూపించడం వల్ల మీకు ఆదాయం వస్తుంది.

youtube

స్పాన్సర్‌షిప్‌లు.. మీ ఛానెల్ పాపులర్ అయిన తర్వాత, వివిధ బ్రాండ్లు వారి ఉత్పత్తులను మీ ఛానెల్ ద్వారా ప్రచారం చేయడానికి మీకు డబ్బు ఇస్తారు.

అఫిలియేట్ మార్కెటింగ్.. మీ వీడియోలలో ఒక ఉత్పత్తి గురించి మాట్లాడినప్పుడు, ఆ ఉత్పత్తి లింక్‌ను డిస్క్రిప్షన్‌లో ఇవ్వవచ్చు. ఆ లింక్ ద్వారా ఎవరైనా ఆ ఉత్పత్తిని కొనుగోలు చేస్తే మీకు కొంత కమీషన్ వస్తుంది.

సభ్యత్వం , ఫ్యాన్ ఫండింగ్.. మీ వ్యూవర్స్ మీకు మద్దతు ఇవ్వడానికి నెలవారీగా కొంత రుసుము చెల్లించే సదుపాయం కూడా యూట్యూబ్‌లో ఉంది.యూట్యూబ్ ఛానెల్‌కు ఈ ఫీచర్ ఉండాలంటే, క్రియేటర్ తప్పకుండా యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు అర్హులు అయి ఉండాలి.

వీడియో ఏ అంశం గురించి చెబుతుందో వివరించడానికి డిస్క్రిప్షన్‌ (description) రాయండి. అలాగే, మీ వీడియోను ఎక్కువమందికి చేర్చడానికి సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లను (#) ఉపయోగించండి. ప్రతిరోజూ, ఒకే సమయానికి వీడియోలు అప్‌లోడ్ చేయడం వల్ల ప్రేక్షకులు మీ కోసం ఎదురుచూస్తారు, మీ ఛానెల్‌కు స్థిరమైన వీక్షణలు పెరుగుతాయి.

మీరు యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికి, 12 నెలల్లో మీ లాంగ్-ఫార్మ్ (సాధారణ) వీడియోల మొత్తం వీక్షణ సమయం 4,000 గంటలు ఉండాలి. అంటే, మీ ఛానెల్‌లోని వీడియోలను ప్రజలు మొత్తం 4,000 గంటల పాటు చూసి ఉండాలి.

ఒకవేళ మీరు యూట్యూబ్ (YouTube)షార్ట్స్ క్రియేట్ చేస్తుంటే, దీనికి నిబంధనలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. షార్ట్స్‌కు మీరు అర్హత పొందాలంటే, గత 90 రోజుల్లో మీ షార్ట్ వీడియోలకు మొత్తం 10 మిలియన్ (1 కోటి) వీక్షణలు (views) రావాలి.

ఇవే కాకుండా విజయవంతమైన యూట్యూబర్ కావాలంటే, మీరు నిరంతరం కంటెంట్‌ను అప్‌లోడ్ చేయాలి. మీ ప్రేక్షకులతో నిరంతరం సంభాషించడం, వారి కామెంట్లకు సమాధానం ఇవ్వడం వల్ల వారితో మంచి బంధం ఏర్పడుతుంది. వీడియో ఎడిటింగ్, సౌండ్, లైటింగ్‌పై దృష్టి పెట్టడం వల్ల మీ వీడియోలు మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి.

literature : లబ్ డబ్

Exit mobile version