Buy Silver: బంగారం కన్నా వెండి కొనడమే మంచిదా? నిపుణులు ఎందుకిలా అంటున్నారు?

Buy Silver : ప్రస్తుతం బంగారం కంటే వెండిలోనే పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Buy Silver

బంగారం ధరలు ప్రస్తుతం నిలకడగా ఉన్నా .. వెండి (Buy Silver)మాత్రం రాకెట్ లాగా దూసుకెళ్తోంది. డిసెంబర్ 20న కిలో వెండి ధర ఏకంగా 2,26,000 రూపాయలకు చేరి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. రోజురోజుకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న ధరలతో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

బంగారం , వెండి(Buy Silver)లో ఏది బలమైన ఇన్వెస్ట్‌మెంట్ అంటే నిపుణులు ప్రస్తుతం బంగారం కంటే వెండిలోనే పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దానికి ప్రధాన కారణాలు ఇవే అని చెబుతున్నారు.

వెండి (Buy Silver)కేవలం నగలకు మాత్రమే కాదు, నేటి కాలంలో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ , 5జీ టెక్నాలజీలో దీని వాడకం విపరీతంగా పెరిగింది. పరిశ్రమల్లో వెండి వినియోగం పెరగడం వల్ల దాని ధరలకు రెక్కలు వచ్చాయి.

వెండి నిల్వలు తక్కువగా ఉండటం, డిమాండ్ పెరగడం వల్ల వెండి ధర రాబోయే రెండేళ్లలో కిలో 3 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏడాది కాలంలో బంగారం సుమారు 100 శాతం రిటర్న్స్ ఇస్తే, వెండి మాత్రం 130 శాతం పైగా లాభాలను అందించింది. డిసెంబర్ 2024 లో వెండి ధర కిలో 95,000 లోపు ఉండేది. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత ఆ ధర 2.26 లక్షలకు చేరింది. అంటే బంగారం ధర కంటే వెండి ధర పెరిగే వేగం చాలా ఎక్కువగా ఉంది.

కాగా మరోవైపు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర 1,23,600 కాగా, 24 క్యారట్ల ధర 1,34,840 వద్ద కొనసాగుతోంది. వెండి ధర మాత్రం కిలోపై ఏకంగా 5 వేలు పెరిగి 2,26,000 వద్దకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 2,14,000 వద్ద ఉంది. ప్రాంతాల వారీగా ఉన్న ట్యాక్సుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంటున్నాయి.

నిపుణుల సూచన ప్రకారం.. మీ పెట్టుబడిలో 70 శాతం బంగారం ఉంటే, కనీసం 30 శాతం వెండి ఉండటం సురక్షితం. ప్రతి నెలా కొంచెం కొంచెం వెండిని కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో అత్యధిక లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version