Gold Costs: తులం బంగారం రూ.1.50 లక్షలు.. వెండి రూ.3 లక్షల వైపు పరుగులు

Gold Costs: కేవలం ఒక్క రోజులోనే తులం బంగారంపై రూ.1,200 వరకు పెరిగింది. దీంతో పసిడి ప్రేమికుల్లో ఆందోళన మొదలైంది.

Gold Costs

దేశీయంగా పసిడి ధరలు సరికొత్త చరిత్రను క్రియేట్ చేస్తున్నాయి. 2025 చివరి నాటికి బంగారం ధరలు(Gold Costs) సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఈరోజు అంటే డిసెంబర్ 28, 2025 గణాంకాలను గమనిస్తే, మార్కెట్లలో బంగారం ధరలు(Gold Costs) భగ్గుమంటున్నాయి. కేవలం ఒక్క రోజులోనే తులం బంగారంపై రూ.1,200 వరకు పెరిగింది. దీంతో పసిడి ప్రేమికుల్లో ఆందోళన మొదలైంది.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Costs) రూ.1,41,220కి చేరగా, 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.1,29,450 వద్ద కొనసాగుతోంది. వచ్చే ఏడాది అంటే 2026 ప్రారంభంలోనే తులం బంగారం ధర రూ.1.50 లక్షల మార్కును సునాయాసంగా దాటేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు అంచనాలకు అందనంతగా వెండి దూకుడు కనబరుస్తోంది..బంగారం ఒక ఎత్తు అయితే, వెండి ధరలు మరో ఎత్తులో ఉంటున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర దేశవ్యాప్తంగా రూ.2.51 లక్షలు దాటేసింది. హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. పారిశ్రామికంగా వెండికి పెరుగుతున్న డిమాండ్, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు,సోలార్ ప్యానెళ్ల తయారీలో దీని వాడకం పెరగడం వల్లే ఈ వెండి ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి.

2026లో కిలో వెండి ధర రూ.3 లక్షల రూపాయలకు చేరువయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బంగారం కొనలేక వెండి కొనేవారు కాస్తా.. ఇప్పుడు వెండి కొనాలంటే కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Gold Costs

ధరల పెరుగుదలకు కారణాలు..అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions) పెట్టుబడిదారులను సురక్షితమైన మార్గం వైపు నడిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, మధ్యప్రాచ్య దేశాల మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోకపోవడం వల్ల డాలర్ కంటే బంగారం మీద పెట్టుబడి పెట్టడానికే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.

దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకోవడం వంటివి ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. భారత్ వంటి దేశాల్లో పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల దేశీయంగా డిమాండ్ కూడా భారీగా పెరిగింది.

ప్రస్తుత ధరలు చూసి చాలామంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ధరలు తగ్గుతాయని వేచి చూడటం కంటే, చిన్న మొత్తాల్లో డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ (ETF) లలో పెట్టుబడి పెట్టడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే 2026లో కూడా బంగారం ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. పసిడిని కేవలం ఆభరణంగా కాకుండా ఒక ఆస్తిగా, తమ తరాలకు అందించే సెంటిమెంట్‌గా భావించే భారతీయులకు, ఈ ధరల పెరుగుదల ఒకవైపు భారంగా అనిపిస్తున్నా, ఇన్వెస్టర్లకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.

హైదరాబాద్ విజయవాడలో రూ.1,41,220 ఉండగా.. ఢిల్లీ రూ.1,41,370, చెన్నై, రూ.1,41,820గా ఉంది. మరి రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తాయో వేచి చూడాలి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version