Platinum: ఆకాశంలో బంగారం ధరలు.. హాట్ టాపిక్ అయిన ప్లాటినం.. ఎందుకు?

Platinum: బంగారం కంటే చాలా ఖరీదైనదిగా ఉన్న ఈ ప్లాటినం, మధ్యలో కొంత కాలం ధరలు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది.

Platinum

సాధారణంగా భారతీయులకు పెట్టుబడి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బంగారమే. రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గడం అనే మాటే తనకు వర్తించదన్నట్లుగా తెగ పరుగులు పెడుతూ కొనేవాళ్లను టెన్షన్ పెడుతుంది.

దీనికి తోడు వెండి కూడా బంగారం రూట్‌లోనే వెళుతుంది. దీంతో బంగారం, వెండిని కొనాలంటేనే చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఈ రెండు ధరలు సరే మరి ప్లాటినం సంగతి ఏంటని దాని గురించి చర్చించుకుంటున్నారు.

అందుకే ఈ మధ్య కాలంలో ‘ప్లాటినం’ (Platinum) అనూహ్యంగా వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు బంగారం కంటే చాలా ఖరీదైనదిగా ఉన్న ఈ ప్లాటినం, మధ్యలో కొంత కాలం ధరలు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. పారిశ్రామికంగా, ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ , ఆటోమొబైల్ రంగాల్లో దీని వాడకం పెరగడంతో ప్లాటినం ధరలు కూడా ఆల్ టైమ్ హైకి చేరుకునే దిశగానే వెళ్తున్నాయి.

చాలామందికి ప్లాటినంను కేవలం ఆభరణాల కోసమే కాకుండా, ఒక ఆస్తిగా (Asset) దీని మీద పెట్టుబడి పెట్టడం అలవాటు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్‌గా మారుతోంది.

Platinum

బంగారంతో పోలిస్తే ఫస్ట్ నుంచీ కూడా ప్లాటినం మార్కెట్ చాలా చిన్నది, కాబట్టి ధరల్లోనూ హెచ్చుతగ్గులు వేగంగా ఉంటాయి. ఇది కొంతవరకు రిస్క్ తో కూడుకున్నదే అయినా, లాంగ్ టర్మ్ లో మాత్రం మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

బంగారం ఎప్పుడూ సేఫ్ బెట్ అయినా సరే, పోర్ట్‌ఫోలియో వైవిధ్యం (Diversification) కోసం కొంత మొత్తాన్ని ప్లాటినం మీద కూడా కేటాయించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ప్లాటినం కొనేటప్పుడు దాని స్వచ్ఛత , రీసేల్ వాల్యూ గురించి ముందుగానే అవగాహన కలిగి ఉండటం అవసరం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అందుకే పెట్టుబడిదారులంతా ఇప్పుడు కేవలం పసుపు లోహం మీదే కాకుండా, ఈ తెలుపు లోహం వైపు కూడా దృష్టి సారిస్తే భవిష్యత్తలో లాభాలు ఉంటాయని అంటున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version