Loan :లోన్ రికవరీ ఏజెంట్లకు ఆర్‌బీఐ చెక్’… కొత్త నిబంధనలేంటి?

Loan : సుమారు 60 శాతం మంది రుణగ్రహీతలు రికవరీ ఏజెంట్ల వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

Loan

బ్యాంకులో కానీ, యాప్స్‌లో కానీ లోన్ తీసుకోవడం ఈజీనే..కాదు కాదు బ్యాంక్స్, లోన్ (Loan )యాప్స్ ఈ ప్రాసెస్‌ను ఈజీ చేసేస్తాయి. అయితే ఒక్క ఇఎంఐ (EMI) ఆలస్యమైతే చాలు.. రికవరీ ఏజెంట్లు ఫోన్లతో చేసే దాడి నరకాన్ని చూపిస్తారు.

అర్ధరాత్రులు ఫోన్ చేయడం, బూతులు తిట్టడం, లోన్(Loan ) తీసుకున్నవారి బంధువులకు ఫోన్ చేసి పరువు తీయడం వంటి చర్యలతో కొన్నేళ్లలో కొన్ని వందల మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ దారుణాలను అరికట్టడానికి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రికవరీ ఏజెంట్ల కోసం కొత్త లక్ష్మణ రేఖను గీశారు.

రెండేళ్లుగా ముఖ్యంగా ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం వెయ్యి రూపాయల కోసం కూడా వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం వంటి ఘటనలతో పాటు, ఇంటికి వచ్చి గొడవ చేయడం వంటి ఘటనలు పెరిగిపోయాయి.

సుమారు 60 శాతం మంది రుణగ్రహీతలు రికవరీ ఏజెంట్ల వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయకపోతే.. చివరకు బ్యాంకింగ్ వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోతుందని ఆర్బీఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్‌బీఐ విధించిన కొత్త రూల్స్ ఇవే..

రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయాలి లేదా ఆ
సమయంలోనే ఇంటికి వెళ్లాలి. అర్ధరాత్రి ఫోన్లు చేసి భయపెట్టడం చట్టవిరుద్ధం.

వ్యక్తిగతంగా దూషించడం, భౌతిక దాడికి ప్రయత్నించడం, కులం పేరుతో మతం పేరుతో ఎగతాళి చేయడం వంటివి చేస్తే సదరు ఏజెంట్‌తో పాటు బ్యాంక్ మీద కూడా ఇకపై కఠిన చర్యలు తీసుకుంటారు.

లోన్ తీసుకున్న వ్యక్తి అనుమతి లేకుండా వారి కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి అంటే వారి బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వకూడదు.

అంతేకాకుండా ఇంటికి వచ్చే ఏజెంట్ కచ్చితంగా బ్యాంకు ఐడెంటిటీ కార్డుతో పాటు అథారిటీ లెటర్‌ను చూపించాలి.

తాము పోలీస్ ఆఫీసర్లమనో లేదా కోర్టు నుంచి వచ్చామనో లోన్ తీసుకున్నవాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారిని భయపెట్టకూడదు.

Loan

ఏజెంట్ వేధిస్తే ఏం చేయాలంటే.. మీరు లోన్ తీసుకున్న బ్యాంకులో ముందుగా కంప్లైంట్ చేయాలి. 30 రోజుల్లో వారు రియాక్టవకపోతే, నేరుగా ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు (RBI Ombudsman) ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ ఏజెంట్లు శృతి మించి ప్రవర్తిస్తే..లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే హక్కు కూడా మీకు ఉంది.

అప్పు తీసుకోవడం అనేది ఒక అగ్రమెంట్ మాత్రమే, అది బానిసత్వం కాదన్న విషయాన్ని బ్యాంకులు, లోన్ యాప్‌లు గుర్తు పెట్టుకోవాలి. అప్పు కట్టలేకపోవడం నేరమే కావచ్చు కానీ, ఆ పేరుతో మనిషిని మానసికంగా ఇలా చంపే హక్కు ఎవరికీ లేదు.

ఆర్బీఐ తెచ్చిన ఈ కొత్త రూల్స్ సామాన్యులకు ఒక పెద్ద వరం లాంటివి. అయితే లోన్ తీసుకున్న వారు కూడా బాధ్యతగా సకాలంలో చెల్లించడానికి ప్రయత్నించాలి..దీనినే అవకాశంగా తీసుకుని లోన్ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేయకూడదు. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ దెబ్బతిని భవిష్యత్తులో ఎలాంటి లోన్ రాకుండా పోతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version