Samsung
కొత్త ఏడాది 2026 ప్రారంభం కావడంతోనే టెక్ ప్రియులందరి కళ్లు శామ్సంగ్(Samsung) రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్26 సిరీస్ పైనే ఉన్నాయి. ప్రతి ఏడాది జనవరిలో శామ్సంగ్ తన ఎస్ సిరీస్ ఫోన్లను లాంచ్ చేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.
దీనిలో కూడా అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ రాబోతున్నట్లు టెక్ లీక్స్ చెబుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరా టెక్నాలజీ గురించి. ఈసారి శామ్సంగ్(Samsung) ఏకంగా 300 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫోటోలు ప్రొఫెషనల్ కెమెరా రేంజ్ లో వస్తాయి.
అంతేకాదు రెండో అతిపెద్ద మార్పు బ్యాటరీ , ఛార్జింగ్ విభాగంలో ఉండబోతోంది. శామ్సంగ్ మొదటిసారిగా గ్రాఫైన్ బ్యాటరీ టెక్నాలజీని వాడబోతున్నట్లు సమాచారం. దీనివల్ల ఫోన్ హీటెక్కడం చాలా వరకు తగ్గుతుంది . కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే ఫోన్ పూర్తి ఛార్జింగ్ అవుతుంది.
అలాగే బ్యాటరీ లైఫ్ కూడా సాధారణ లిథియం అయాన్ బ్యాటరీల కంటే రెట్టింపు కాలం వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ను ఇందులో వాడనున్నారు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనులను అత్యంత వేగంగా పూర్తి చేస్తుంది.
మరో ముఖ్యమైన ఫీచర్ శాటిలైట్ కనెక్టివిటీ. మొబైల్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో కూడా అత్యవసర సమయంలో మెసేజ్ లు పంపడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
డిజైన్ పరంగా కూడా శామ్సంగ్ ఈసారి టైటానియం ఫ్రేమ్‌ను మరింత దృఢంగా, తేలికగా రూపొందించింది. జనవరి చివరి వారంలో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో ఈ ఫోన్లు అధికారికంగా రిలీజయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ప్రియులకు ఇది ఒక గొప్ప పండుగ అనే చెప్పాలి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
