Gold rate today:పండుగ ముందు భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు..ఈరోజు గోల్డ్ ధర ఎలా ఉందంటే..

Gold rate today: శుక్రవారంతో పోలిస్తే ఈరోజు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి.

Gold rate today

కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు అదే స్పీడ్ కంటెన్యూ చేయడమే కాకుండా.. శనివారం ఒక్కసారిగా కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చాయి. శుక్రవారంతో పోలిస్తే ఈరోజు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే బంగారం, వెండి ధరలు ఈ రేంజ్‌లో పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. .

హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధరల(Gold rate today) విషయానికి వస్తే, 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి 10 గ్రాముల ధర ఏకంగా వెయ్యి రూపాయల పైనే పెరిగింది. నిన్న లక్షా ముప్పై తొమ్మిది వేల మూడు వందల పది రూపాయలు(1,39,310)గా ఉన్న ఈ ధర,ఈరోజు లక్షా నలభై వేల నాలుగు వందల అరవై రూపాయల(1,40,460)కు చేరింది. అంటే ఒక్క రోజులోనే పదకొండు వందల యాభై రూపాయల పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చింది.

అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర కూడా ఈరోజు (Gold rate today)లక్షా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల(1,28,750) వద్ద కొనసాగుతోంది. ఇదే ట్రెండ్ విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ కనిపిస్తోంది. చెన్నైలో మాత్రం ధరల పెరుగుదల కొంత స్వల్పంగానే ఉన్నా కూడా, బెంగళూరులో మాత్రం హైదరాబాద్ ధరలతో సమానంగా పసిడి రేట్లు కొనసాగుతున్నాయి.

Gold rate today

కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపించడానికే ఫిక్స్ అయ్యాయి అన్నట్లుగా పరుగులు పెడుతున్నాయి. బెంగళూరులో కిలో వెండి ధర ఏకంగా పదకొండు వేల రూపాయలు పెరిగి రెండు లక్షల అరవై వేల రూపాయలకు(2,60,000) చేరగా, హైదరాబాద్ లో మరింత ఎక్కువగా ఏడు వేల రూపాయల పెరుగుదలతో రెండు లక్షల డెబ్బై ఐదు వేల(2,75,000) రూపాయల వద్ద స్థిరపడింది. మొత్తంగా పెళ్లిళ్ల సీజన్ కు ముందే ఇలా ధరలు పెరగడం మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతోంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version