Tola of Gold: పసిడి ప్రేమికులకు షాకింగ్ న్యూస్.. లక్షన్నరకు చేరువలో తులం బంగారం ధర

Tola of Gold: ఆభరణాల కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర 1,27,010 రూపాయలుగా నమోదైంది.

Tola of Gold

భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. ఆడవారి అలంకరణతో పాటు, కష్టకాలంలో ఆదుకునే పెట్టుబడిగా కూడా పసిడిని భావిస్తారు. అయితే, 2025 సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరలు(Tola of Gold) నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తుంటే సామాన్యులకు ఇది అందని ద్రాక్షలా మారుతుందేమో అన్న ఆందోళన మొదలైంది.

తాజాగా ఉన్న ధరల ప్రకారం, మన దేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల(Tola of Gold) ధర ఏకంగా 1,38,560 రూపాయలకు చేరుకుంది. అంటే తులం బంగారం ధర లక్షన్నరకు చేరువలో ఉందన్నమాట. అదేవిధంగా ఆభరణాల కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర 1,27,010 రూపాయలుగా నమోదైంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా అదే వేగంతో పరుగులు తీస్తున్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం 2,34,100 రూపాయల వద్ద ఉంది.

Tola of Gold

ఈ స్థాయిలో ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులే కారణం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, యుద్ధ మేఘాలు , రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుతున్నాయి.

మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో దాదాపు ఇదే రకమైన ధరలు కొనసాగుతున్నాయి. అయితే స్థానిక పన్నులు , జ్యువెలరీ షాపుల మేకింగ్ చార్జీల బట్టి తుది ధరలో కొంత మార్పు ఉండొచ్చు. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న సమయంలో ఈ రకమైన ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద తలనొప్పిగా మారింది. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ నిపుణుల అంచనా ప్రకారం, మరికొంత కాలం బంగారం ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version