Youth:అప్పుల్లో యువత.. అప్పుల ఊబిలోకి ఎందుకు నెట్టబడుతున్నారు?

Youth:ప్రతి ఒక్కరు ఆర్థికంగా స్వతంత్రంగా, ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. దీనికి కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దానిని సరిగ్గా నిర్వహించడం కూడా అవసరం.

Youth in debt

ఈ మధ్యకాలంలో యువత(Youth) ఆర్థిక ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. తమ జీవనశైలిని మెరుగుపరుచుకోవాలన్న ఆరాటం, సమాజంలో ఉన్న పోలికల ఒత్తిడి, టెక్నాలజీ పెరుగుదల.. ఇవన్నీ యువతను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ లోన్ యాప్స్,వాయిదాల కొనుగోళ్లు (EMI) ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

ఎందుకు అప్పులు పెరుగుతున్నాయంటే ఇప్పుడు రుణాలను పొందడం చాలా సులభం. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలతో పాటు, మొబైల్ యాప్‌లు కూడా నిమిషాల్లో అప్పులు ఇస్తున్నాయి. ఈ సౌలభ్యం యువతను అనవసర ఖర్చులకు ప్రేరేపిస్తోంది.అలాగే సోషల్ మీడియాలో చూసే విలాసవంతమైన జీవితాలను అనుకరించాలని యువత ప్రయత్నిస్తున్నారు. దీనికోసం తమ ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నారు.

EMI ఉచ్చు కూడా కారణమే.. “ఇప్పుడే కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి” (Buy Now, Pay Later) అనే పథకాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, దీనివల్ల ఒక చిన్న కొనుగోలు కూడా ఒక పెద్ద రుణ భారాన్ని సృష్టిస్తుంది.

Youth

ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయడానికి.. మొదట మీ నెలవారీ ఆదాయం, మరియు ఖర్చుల జాబితాను తయారు చేసుకోండి. దీనివల్ల మీ డబ్బు ఎక్కడికి పోతోందో ఒక స్పష్టత వస్తుంది.
మీరు తీసుకున్న అప్పులన్నింటినీ జాబితా చేసుకోండి. అధిక వడ్డీ ఉన్న రుణాలను ముందుగా తీర్చడానికి ప్రయత్నించండి.క్రెడిట్ కార్డుల జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డులను అత్యవసర సమయాల్లో మాత్రమే వాడండి. వాటిపై ఉండే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.

పాఠశాల విద్య నుంచే ఆర్థిక నిర్వహణ గురించి నేర్చుకోవడం చాలా అవసరం. బడ్జెట్ ఎలా వేయాలి, పొదుపు ఎలా చేయాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి.

ఆర్థికంగా ఆరోగ్యకరమైన జీవితానికి చిట్కాలు.. ప్రతి నెల మీ ఆదాయంలో కనీసం 10-20% పొదుపు చేయడానికి ప్రయత్నించండి.అనవసర ఖర్చులు తగ్గించండి. కాఫీ షాప్‌లకు వెళ్ళడం, ఖరీదైన రెస్టారెంట్లలో తినడం వంటి చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకోండి. ఈ డబ్బును పొదుపు చేయవచ్చు.

ఒక ఆర్థిక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఉదాహరణకు, ఒక సంవత్సరం లోపు ఒక బైక్ కొనడం, లేదా ఒక పెద్ద అప్పు తీర్చడం లాంటివి. ఈ లక్ష్యం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.ప్రతి ఒక్కరు ఆర్థికంగా స్వతంత్రంగా, ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. దీనికి కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దానిని సరిగ్గా నిర్వహించడం కూడా అవసరం.

Health: ఆరోగ్యానికి ఆన్‌లైన్‌ ఆప్షన్స్‌..డాక్టర్ కన్సల్టేషన్ యాప్స్ ఎలా పనిచేస్తాయి?

Exit mobile version