Krishna Master: మొన్న జానీ మాస్టర్…ఇప్పుడు కృష్ణ మాస్టర్.. ఆ తర్వాత ఇంకెవరు?

Krishna Master: రాంగ్ స్టెప్పులేస్తున్న కొరియోగ్రాఫర్లు..కెరీర్ క్లోజ్

Krishna Master

మొన్న జానీ మాస్టర్…ఇప్పుడు కృష్ణ మాస్టర్ (Krishna Master) .. సినీ పరిశ్రమలో ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్లు..కొద్ది రోజులకే కటకటాలపాలయ్యారు. తాజాగా గచ్చిబౌలిలో ‘ఢీ’ రియాలిటీ షోకు కొరియోగ్రాఫర్‌(Dhee choreographer)గా పనిచేస్తున్న కృష్ణ మాస్టర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు.

jhony master

మైనర్ బాలికపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో పోక్సో చట్టం కింద ఫిర్యాదు వచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, అతను బెంగుళూరులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా రిమాండ్‌పై కంది జైలుకు తరలించారు.

కృష్ణ మాస్టర్(Krishna Master) మీద లైంగిక ఆరోపణలు ఇవే మొదటివి కావు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా యువతులను మోసం చేశాడనే ఆరోపణలు, భార్యకు సంబంధించిన రూ. 9 లక్షలు తీసుకుని పరారైయ్యాడన్న వార్తలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి.

అయితే ఈ అరెస్ట్‌తో ఇప్పుడు అందరికీ గుర్తుకు వస్తున్నాడు మరో ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master). గతంలో ఓ యువతి అతడిపై చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో . కేసు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదై, విచారణ కూడా కొనసాగింది.

జానీ మాస్టర్, కృష్ణ మాస్టర్ కాదు ..గతంలో కొంతమంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లపైనా చిన్న కేసులు నమోదయ్యాయి. పలు డాన్స్ అకాడెమీల్లో ఫిర్యాదులు వచ్చినా అవన్నీ బయటకు రాలేకపోయాయన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

krishna master

పాపులారిటీ వచ్చిన ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించాలి . ఒక ఫిర్యాదు చాలు.. జీవితాన్ని తలకిందలు చేస్తుంది. మరీ ముఖ్యంగా మైనర్లకు సంబంధించిన కేసుల్లో, నిజంగా నేరం చేశారో లేదో సంగతి దేవుడెరుగు. అసలా కేసు పెట్టారంటేనే సగం జీవితం గోదాట్లో కలిసిపోయినట్లే.

ఇన్నాళ్లూ మెట్టూ మెట్టూ ఎక్కి సాధించిన పాపులారిటీ అంతా క్షణాల్లో మట్టికొట్టుకుపోతుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది ఒక్క కొరియోగ్రాఫర్స్ విషయమే కాదు ఎక్కడైనా కాస్త ఫేమ్ వచ్చిన వాళ్లు .. ఎంత కష్టపడి దానిని సంపాదించుకున్నారో అంతే కష్టపడి నిలబెట్టుకోవాలన్న ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోతున్నారు.

Also Read: iPhone: ఓ మై గాడ్.. ఐఫోన్‌లో ఇన్ని మైండ్ బ్లోయింగ్ ఫీచర్లున్నాయా?

 

Exit mobile version