drink blood: మనుషుల రక్తం(blood) తాగే క్యారెక్టర్‌లతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఆ క్యారెక్టర్లు కేవలం కథల కోసం సృష్టించబడ్డాయి. కానీ నిజ ప్రపంచంలో కూడా రక్తం తాగే వ్యక్తులు ఉన్నారు. రక్తం తాగడం(drink blood) అనేది ఒక జబ్బు లేదా మానసిక స్థితి. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ వ్యాధి ఉంటుంది, దీనిని క్లినికల్ వాంపైరిజం(Clinical vampirism) అని పిలుస్తారు.
People who drink blood
People who drink blood: ఆటో వాంపైరిజం: సాధారణంగా చాలా మంది తమ చిన్న వేలు తెగి రక్తం వస్తే, వెంటనే వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఆ సమయంలో వారికి రక్తం రుచి కూడా తెలుస్తుంది, అయినా ఇబ్బంది పడకుండా రక్తం ఆగిపోయే వరకు అలా నోట్లోనే ఉంచుతారు. ఇలా రక్తం రుచి చూడటాన్ని ఆటో వాంపైరిజం అంటారు. ఇది అసాధారణ చర్య. వీరికి ప్రత్యేకంగా రక్తం రుచి చూడాలని ఉండదు, కానీ అనుకోకుండా రుచి చూస్తారు. ఇక కొందరైతే తెగిన వేలును నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేయరు, ఎందుకంటే వారికి రక్తం రుచి ఏ మాత్రం చూడాలనిపించదు.
క్లినికల్ వాంపైరిజం: క్లినికల్ వాంపైరిజం ఉన్న వారికి రక్తం తాగాలనే కోరిక(Desire to drink blood) ఎక్కువగా ఉంటుంది. ఇదో మానసిక సమస్య. ఇలా రక్తం తాగాలనిపించడం సాధారణంగా ఉంటే క్లినికల్ వాంపైరిజం అంటాం. ఇదే కోరిక తీవ్ర స్థాయిలో ఉంటే, ఈ జబ్బును రెన్‌ఫీల్డ్స్ సిండ్రోమ్ అంటారు. వీరు రక్తం తాగకుండా ఉండలేరు. వీరికి వేలు కోసుకొని రక్తం తాగాలనిపిస్తుంటుంది, కానీ ఆ కోరికను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఈ జబ్బు ఎందుకు వస్తుందో వైద్యులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఏదైనా సంఘటన ఇలాంటి వ్యాధి రావడానికి ప్రేరణ అవుతుందని అంటున్నారు. ఆటో వాంపైరిజంతో మొదలయ్యే ఈ వ్యాధి చివరకు రెన్‌ఫీల్డ్స్ సిండ్రోమ్ దశకు చేరుకుంటుంది. రక్తం కళ్ళారా చూడటం వంటివి వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఎవరి రక్తం వారు తాగడాన్ని ఆటోవాంపైరిజం అంటారు. అదే ఇతర మనుషులు, జంతువుల రక్తం తాగాలనిపిస్తే మాత్రం దాన్ని ‘జూఫాగియా’ అంటారు. దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు.