crimes : రీల్ కాదు రియల్ క్రైమ్‌లు.. నో ఎస్కేప్

crimes : జీవితం అంటే 'రీల్' (reel) కాదు, 'రియల్' (real) అని అందుకే, నేరానికి పాల్పడిన కొన్ని గంటల వ్యవధిలోనే వారు పోలీసులకు అడ్డంగా బుక్కయిపోతున్నారని అంటున్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

crimes : దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా జరిగిన దారుణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. మొదట భోజనంలో నిద్రమాత్రలు (sleeping pills) కలిపి ఇచ్చింది. అయినా ప్రాణం పోకపోవడంతో, ఏకంగా కరెంట్ షాక్ (electric shock) ఇచ్చి చంపేసింది. ఆ తర్వాత, ఇది ప్రమాదవశాత్తు జరిగిన కరెంట్ షాక్ అంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు అప్పటికే మరణించినట్లు నిర్ధారించడంతో, అందరూ దీన్ని ఒక ప్రమాదంగానే భావించారు. కానీ, ఆ మహిళ ఫోన్‌లో కనిపించిన ఇన్‌స్టాగ్రామ్ చాట్ (Instagram chat) వివరాలు అసలు నిజాన్ని బయటపెట్టాయి. మరిదిపై ఉన్న మోజుతోనే భర్తను హత్య చేసినట్లు తేలింది.

crimes

ఇది ఢిల్లీలో జరిగినా.. ఇలాంటి దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో సినిమాలు, ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్, సీరియల్స్ చూసి నేరస్తులు పోలీసుల దర్యాప్తు (investigation) ఎలా ఉంటుందో, ప్రూఫ్స్ దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో, ఒకవేళ దొరికినా ఎలా బురిడీ కొట్టించాలో (mislead) తెలుసుకున్నామనే భ్రమలో హత్యలకు పాల్పడుతున్నారని మానసిక నిపుణలు అంటున్నారు.

ముఖ్యంగా ‘దృశ్యం’ (Drishyam) వంటి సినిమా ప్రభావం చాలామందిపై ఉంది. హత్య చేశాక, సినిమాలోని హీరోలా ఏవో ఎత్తులు (tactics) వేసి తప్పించుకోవచ్చని వారు కలలు కంటున్నట్లు మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. జీవితం అంటే ‘రీల్’ (reel) కాదు, ‘రియల్’ (real) అని అందుకే, నేరానికి పాల్పడిన కొన్ని గంటల వ్యవధిలోనే వారు పోలీసులకు అడ్డంగా బుక్కయిపోతున్నారని అంటున్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

ఇటీవల ప్రియుడు తిరుమలరావు మాయలో పడి కట్టుకున్నోడిని పెళ్లయిన నెల రోజుల్లోనే సహస్ర అలియాస్ ఐశ్వర్య గత జూన్‌లో దారుణంగా హత్య చేయించింది. అప్పులు తీర్చేందుకు సొంత అత్త తాడికొండ రామవ్వ పేరిట జీవిత బీమా (life insurance) చేయించి మరీ రోడ్డు ప్రమాదం రూపంలో ఇటీవల హత్య చేయించాడు సిద్దిపేట జిల్లా పెద్ద మాసాన్‌పల్లికి చెందిన తాళ్ల వెంకటేశ్ అనే వ్యక్తి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త వస్తువుల స్వామిని ఈ నెల 13న ప్రమాదాన్ని తలపించేలా కారుతో ఢీకొట్టించి హత్య చేసిన అతడి భార్య స్వాతి, ఆమె ప్రియుడు గుంటి సాయికుమార్, తమ్ముడు మహేశ్ వీళ్లందరి బండారం కొన్ని గంటల్లోనే బయటపడింది.

మరో కేసులో, రూ.7 లక్షల అప్పు తిరిగివ్వాలని ఒత్తిడి చేస్తున్న యర్రం అనురాధా రెడ్డిని హత్య చేసిన చంద్రమోహన్, పోలీసులకు పట్టుబడకుండా డెడ్ బాడీని (dead body) మాయం చేయడం గురించి, ముక్కలు చేసేందుకు వాడాల్సిన రాతి రంపాల గురించి గూగుల్‌లో సెర్చ్ (search) చేశాడు. మృతదేహాన్ని 6 ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఎలాంటి దుర్వాసన రాకుండా అగరుబత్తీలు (incense sticks) వెలిగించేవాడు, సెంటు (perfume) చల్లేవాడు. తల భాగాన్ని సంచిలో పెట్టి చాదర్‌ఘాట్ వద్ద మూసీ నదిలో పడేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో ఈ ఘటన చోటుచేసుకుంది.

గత జనవరిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్‌లో జరిగిన ఘటన పోలీసులనే అవాక్కయ్యేలా చేసింది. కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి, ఉడకబెట్టి, పొడి చేసి మరీ దాన్ని నీళ్లలో కలిపిన గురుమూర్తి ఉదంతం మొదట ఒక మిస్టరీగా మారింది. అయితే, ఫిర్యాదు అందిన కేవలం 3 రోజుల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. శరీర భాగాలను ముక్కలు చేయడానికి వాడిన వస్తువులు, ఉడకబెట్టేందుకు ఉపయోగించిన పాత్రల నుంచి పకడ్బందీ ఆధారాలు (solid evidence) సేకరించి అతడి బండారం బట్టబయలు చేశారు.

ఇక ఏడో తరగతి చదువుతున్న తమ కుమార్తెను లోబరచుకొని దాచాడని భావించిన క్యాబ్‌ డ్రైవర్ మురళి, ఆయన భార్య ద్వారక, ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న కుమార్‌పై కక్ష పెంచుకున్నారు. కుమార్‌పై హనీ ట్రాప్ (honey trap) విసిరిన ద్వారక, ఫోన్ చేసి ఖాళీగా ఉన్న బంధువుల ఇంటికి రప్పించిన దంపతులు...చిత్రహింసలు పెట్టి.. అపస్మారక స్థితిలోకి చేరుకోగానే.. అతడిని కోదాడకు దగ్గర్లోని సాగర్ కాలువలో శరీరానికి బండరాళ్లు కట్టి విసిరేశారు. ఇంతటితో కథ క్లోజ్ అయిపోయిందనే అనుకున్నారు.

కుమార్ ఆటో నంబర్ ప్లేట్ మార్చిన మురళి, దాన్ని తానే హైదరాబాద్‌లో ఉపయోగించడం మొదలుపెట్టాడు. 2023 మార్చి 11న కుమార్ హత్య జరగగా.. 2024 డిసెంబర్‌లో మాదాపూర్‌లోని గూగుల్ (Google) ఆఫీసు వద్ద ఆటోను గమనించిన కుమార్ బావమరిది, తన బావ ప్రత్యేకంగా తయారు చేసుకున్న బంపర్ ఉండటంతో అనుమానం వచ్చి బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మురళిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, హత్య బండారం బయటపడింది.

నేరాలు చేస్తున్నారు. తప్పించుకోవాలని బడా స్కెచ్‌లే వేస్తున్నారు. అయితే చిన్న నేరమో.. పెద్ద నేరమో బయటపడటానికి టైమ్ పట్టొచ్చు కానీ.. నేరం మాత్రం దాగదు. క్రైమ్ (crime) చేస్తే తప్పించుకోవడం అసాధ్యం. దర్యాప్తు (investigation) ఆలస్యం కావచ్చేమో గానీ, నిందితులు మాత్రం పట్టుబడటం ఖాయమని తెలుసుకోవాలి. అందుకే హత్యలు వంటి నేరాల్లో 99 శాతం మంది నిందితులు దొరుకుతూనే ఉన్నారు.

Exit mobile version