Akhanda 2 Collections
నందమూరి నట సింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన మూవీ ‘అఖండ 2 – తాండవం(Akhanda 2 Collections)’ తొలి రోజు బాక్సాఫీస్ (Box Office) వద్ద భారీ వసూళ్లను (Huge Collections) సాధించి తాండవం ఆడింది. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, బ్లాక్ బస్టర్ ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ (Sequel) కావడంతో భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తొలి ఆట నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ (Positive Talk) తెచ్చుకుంది. ముఖ్యంగా, బాలయ్య నట విశ్వరూపం, శివతాండవాన్ని తలపించే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు (High Voltage Action Sequences) అభిమానులకు ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే ఈ మూవీ రూ. 59.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా చెబుతూ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఇక ఈరోజు రేపు వీకెండ్స్ కావడంతో ఈ మూవీ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాటు ఒకటి లేదా రెండు రోజుల్లోనే అఖండ 2 వసూళ్లు రూ. 100 కోట్ల మార్కును దాటే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు.
The DIVINE ROAR is heard LOUD & CLEAR 💥💥#Akhanda2 collects a gross of 59.5 CRORES+ on Day 1 (including premieres), making it the biggest opener for God of Masses #NandamuriBalakrishna ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/8l5WolzzT6#Akhanda2Thaandavam… pic.twitter.com/YpXzF1xRyE— 14 Reels Plus (@14ReelsPlus) December 13, 2025
ఈ మూవీలో కథానాయికగా సంయుక్త నటించగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా లు కీలక పాత్రలను పోషించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించగా, బాలయ్య రెండో కూతురు తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పించారు. ‘అఖండ 2’ కలెక్షన్స్ రాబోయే రోజుల్లో కూడా అదే జోరును చూపించి, బాలయ్య మాస్ క్రేజ్‌ని (Mass Craze) నిరూపిస్తాయన్న నమ్మకాన్ని ఈ కలెక్షన్స్ ప్రూవ్ చేశాయి..
