Allu Arjun :సైమా వేదికపై మెరిసిన అల్లు అర్జున్..వరుసగా మూడోసారి

Allu Arjun :'పుష్ప 2: ది రూల్' సినిమా దుబాయ్ సైమా వేదికపై ఏకంగా ఐదు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు.

Allu Arjun

ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తొలి రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులు అందజేయగా, కొన్ని సినిమాలు, నటులు ఈ అవార్డుల వేదికపై తమ సత్తా చాటారు. ముఖ్యంగా, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం పలు విభాగాల్లో అత్యధిక పురస్కారాలు సాధించింది. ఈ చిత్రానికి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని, తన స్టార్‌డమ్‌ను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు.

Allu Arjun

వరుసగా మూడోసారి సైమా అవార్డు..అల్లు అర్జున్‌(Allu Arjun)కు సైమా అవార్డు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా, ఆ తర్వాత ‘పుష్ప 2’ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇప్పుడు, ‘పుష్ప 2: ది రూల్’కు గాను ఈ పురస్కారం లభించడంతో, ఆయన వరుసగా మూడోసారి సైమా వేదికపై బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ సినిమా దుబాయ్ సైమా వేదికపై ఏకంగా ఐదు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు.

అవార్డు అందుకున్న తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun )తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విజయం కేవలం తన ఒక్కడిదే కాదని, దీని వెనుక ఉన్న క్రెడిట్ మొత్తం దర్శకుడు సుకుమార్, అలాగే ‘పుష్ప 2’ చిత్ర బృందానికి చెందుతుందని తెలిపారు. సుకుమార్ విజనరీ డైరెక్షన్, చిత్ర బృందం చేసిన అపారమైన కృషి లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు. అదనంగా, తన ఎదుగుదలకు, విజయాలకు కారణమైన అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవార్డును వారికి అంకితం చేస్తున్నానని ఆయన ప్రకటించారు.

సైమా 2025 విజేతలు (తెలుగు)

 

Exit mobile version