Thalaiva: తలైవాకు శుభాకాంక్షల వెల్లువ..

Thalaiva: రజినీకి యాక్షన్‌ అంటే సెపరేట్ స్టైల్‌, డైలాగ్ డెలివరీ అంటే స్పెషల్‌ స్పీడ్‌, స్క్రీన్‌పై కనిపించే గ్లామర్‌ అంటే ఆయనకే వున్న నేచురల్‌ మాగ్నెటిజం. ఇవన్నీ కలిసి ఆయనను నటుడిగా “వేరే లెవెల్” కి తీసుకెళ్లాయి.

Thalaiva

భారత సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్ అని పిలిచినపుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఒకే పేరు .. రజినీకాంత్(Thalaiva). ఏ భాష ప్రేక్షకులకైనా ప్రత్యేక పరిచయం అవసరం లేని స్టార్. ఆయన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, వాక్… ఇవన్నీ ఆయనకే ప్రత్యేకం.

ఈ రోజు రజినీకాంత్ జన్మదినం. 75 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన తలైవా(Thalaiva), ఈరోజుతో సినీ పరిశ్రమలో సగం శతాబ్దం పూర్తి చేసుకున్న ఘనతను కూడా దాటారు. ఒకప్పుడు బస్ కనడక్టర్‌గా ఉన్న వ్యక్తి, కేవలం ప్రతిభతో ఇండియన్ సినిమా ఐకాన్‌గా ఎదిగిన ప్రయాణం ఏ థ్రిల్లర్ స్టోరీ కంటే తక్కువ కాదు.
రజినీ కెరీర్‌లో ఎన్నో పీక్ మొమెంట్స్ ఉన్నాయి.

తమిళం, తెలుగు, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లో ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ.. దేశ స్థాయిలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్‌కు చేర్చింది. కొన్ని సినిమాలు విదేశాల్లో కూడా అనూహ్యమైన రికార్డులు కొట్టి, ఇండియన్ సినిమా పవర్‌ను మళ్లీ ప్రపంచానికి చూపించాయి. స్టైల్, యాటిట్యూడ్, ఎనర్జీ. అన్నటిక్‌గా కనిపించే ఆ వాకింగ్‌, సిగరెట్ టాస్‌, కళ్లతో ఇచ్చే ఆ స్మార్ట్ ఎక్స్‌ప్రెషన్స్‌… ఇవన్నీ ఆయనని మిగతా హీరోల నుంచి సెపరేట్‌గా నిలిపాయి.
రజినీకాంత్ మొదటి సినిమా అపూర్వ రాగంగల్.

దాంట్లో పెద్ద రోల్‌ కాదు, టైటిల్ రోల్ కూడా కాదు. కానీ ఆయన ఎంట్రీలో ఉన్న బాడీ లాంగ్వేజ్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. రజినీ(Thalaiva)కి యాక్షన్‌ అంటే సెపరేట్ స్టైల్‌, డైలాగ్ డెలివరీ అంటే స్పెషల్‌ స్పీడ్‌, స్క్రీన్‌పై కనిపించే గ్లామర్‌ అంటే ఆయనకే వున్న నేచురల్‌ మాగ్నెటిజం. ఇవన్నీ కలిసి ఆయనను నటుడిగా “వేరే లెవెల్” కి తీసుకెళ్లాయి.

Thalaiva

బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అంటే రజినీకాంత్ పేరు గ్యారంటీ. పాత కాలం నుంచి ఇప్పటివరకు ఆయన మార్కెట్ తగ్గకుండా పెరుగుతూనే వచ్చింది. ఇతర హీరోలు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేకపోయినా, రజినీ మాత్రం వందల కోట్లలో డీల్స్ క్లోజ్ చేసే స్థాయికి వెళ్లారు.

ఇటీవల వచ్చిన జైలర్, ప్రస్తుతం పనిలో ఉన్న కూలీ వంటి సినిమాలకు రజినీ తీసుకున్న పారితోషికం రూ.200 కోట్లకు పైగానే ఉండటం ఆయన రేంజ్ ఏంటో చెబుతోంది. ఏ వయసులోనైనా ఈ స్థాయి క్రేజ్ అంటే అది రజినీకాంత్‌కే సాధ్యం.

తలైవా(Thalaiva) పుట్టినరోజు సందర్భంగా సినీ సీనియర్‌లు, దర్శకులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అభిమానులు అందరూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు భారీగా విషెస్ చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి రజినీకాంత్‌కు ఉన్న దేశవ్యాప్త ప్రభావాన్ని మరోసారి గుర్తు చేశారు.

రజినీ కెరీర్ గురించి మాట్లాడితే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది . అందరికంటే పెద్ద స్టార్‌గా నిలబడటానికి ఆయన సాగించిన ప్రయాణం ఏ రోజూ సులువు కాలేదు. స్ట్రగుల్స్, హార్డ్ వర్క్, డిసిప్లిన్, ఎమోషనల్ డెడికేషన్ .. ఇవన్నీ కలిసి ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చాయి.

ఇప్పటికీ ఆయన సినిమాకు రిలీజ్ వస్తే థియేటర్ల ముందు పండుగ వాతావరణం కనిపిస్తుంది. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే ప్రేక్షకులు హాలే కదిలేలా చేసే పవర్ ఇప్పటికీ తగ్గలేదు.ఒక మాటలో చెప్పాలంటే సినిమా ప్రపంచంలో రజినీకాంత్ ఒక స్టార్ కాదు… ఒక ఫెనామెనా.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version