Anasuya : డిజిటల్ ప్రపంచంతో అనసూయ వార్‌‌‌

Anasuya : "నేను ఒక మహిళను, భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని. నాకు నచ్చిన దుస్తులు ధరించడం ఇష్టం. తల్లి అయినంత మాత్రాన నా నిజమైన స్వరూపాన్ని వదులుకోవాలా?" అని ఆమె ప్రశ్నించారు.

Anasuya : లక్షల మంది ట్రోల్స్, వేలాది నెగిటివ్ కామెంట్లు.. ఇవి ఏ సెలబ్రిటీకైనా వెన్నులో వణుకు పుట్టించేవే. అందులోనూ ఓ మహిళ అయితే ఎప్పుడో సోషల్ మీడియాకు దండం పెట్టేసి దూరంగా ఉండేవారు. కానీ, అనసూయ భరద్వాజ్ మాత్రం ఈ డిజిటల్ యుద్ధంలో ఎక్కడా బెదరకుండా, మరింత ధైర్యంగా నిలబడుతూనే ఉన్నారు.

Anasuya

తనపై వచ్చే విమర్శలకు అంతే ధైర్యంగా పోరాడుతూ, ఎందరికో అనసూయ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు, కేవలం ఒక నటి ఆవేదన కాదు, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఒక మహిళ చేసిన పోరాటాన్ని చెప్పకనే చెప్పాయి.

జబర్దస్త్ షోతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ, ఆ తర్వాత నటిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. పెళ్ళై, ఇద్దరు పిల్లల తల్లి అయినా, ఆమె అందం, ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, కుర్ర హీరోయిన్లకు ధీటుగా నిలబడతారు. అయితే, ఆమె దుస్తులు, వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్స్, నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి.

ఈ విమర్శలపై అనసూయ మాట్లాడుతూ, “నా గురించి అడ్డగోలుగా మాట్లాడే దాదాపు 3 లక్షల మందిని నేను బ్లాక్ చేశాను..నేను భయపడను. నా డ్రెస్సింగ్ నా ఇష్టం. నా జీవితం నాదే” అంటూ ఘాటుగా కౌంటర్లిస్తుంటారు. ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్ తాను ఏమనుకుంటుందో అది చెప్పేస్తారు.

అంతేకాదు తన జీవనశైలిపై వచ్చే విమర్శలపై అనసూయ సొసైటీ తనను తాను ప్రశ్నించుకోవాల్సిన ఘాటు ప్రశ్ననే సంధించారు. “నేను ఒక మహిళను, భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని. నాకు నచ్చిన దుస్తులు ధరించడం ఇష్టం. తల్లి అయినంత మాత్రాన నా నిజమైన స్వరూపాన్ని వదులుకోవాలా?” అని ఆమె ప్రశ్నించారు.

తనపై కౌంటర్లు ఇచ్చిన వారికి ఈ మాటలు కాస్త పొగరుగా చెప్పినట్లే ఉంటాయి. కానీ కాస్త సునిశితంగా చూస్తే మాత్రం అనసూయ మాట్లాడింది హండ్రెడ్ పర్సంట్ నిజం అని ఎవరైనా ఒప్పుకుంటారు. అలా ఒప్పుకున్నవారంతా అనసూయ గట్స్‌కు తప్పనిసరిగా సలాం కొడతారు కూడా.

అంతేకాదు నా పిల్లలు ధైర్యంగా, గౌరవంగా జీవించే ఒక మహిళను చూస్తూ పెరుగుతున్నారు. నా ఇష్టం ప్రకారం దుస్తులు ధరించడం వల్ల నా విలువలు ఏమాత్రం తగ్గవు” అని అనసూయ గట్టిగా చెప్పారు. ఇలా అనసూయ చూపించే ఈ ధైర్యం, ఆత్మవిశ్వాసమే ఆమెను ఇంకా సోషల్ మీడియాలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుపుతున్నాయి.

అనసూయ డ్రెస్సింగ్‌పైన ఎంతో మంది కామెంట్లు చేస్తుంటారు. నిజమే చూడటానికి ఆమె డ్రస్సులు ఓవర్ డోస్ అయినట్లున్నా.. ఆమె భర్తకు , ఇంట్లో వాళ్లకు లేని అభ్యంతరం మనకెందుకు అని అనసూయకు సపోర్టు చేసిన వాళ్లూ ఉన్నారు. ఏది ఏమయినా ఇన్ని ట్రోలింగ్స్, నెగెటివ్ కామెంట్ల మధ్య తన ఉనికి కోసం, తన లైఫ్ స్టైల్ కోసం డిజిటల్ వార్ చేస్తున్న అనసూయ ధైర్యానికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాలి.

Anasuya
Exit mobile version