Mokshagna entry: మోక్షజ్ఞ ఎంట్రీని కన్ఫమ్ చేసిన బాలకృష్ణ

Mokshagna entry: గతంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా రానుంది అంటూ అధికారిక ప్రకటన వెలువడింది.

Mokshagna entry

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చరణ్ వచ్చాడు..నాగ్ వారసులుగా నాగ చైతన్య, అఖిల్ వచ్చారు మరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ (Mokshagna entry)ఇండ్రస్ట్రీకి ఎంట్రీ ఎప్పుడొస్తాడు అనే ప్రశ్న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప డేట్, క్లారిటీ మాత్రం ఉండటం లేదు. తాజాగా దీనిపై బాలక‌ృష్ణ రియాక్టవడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

తన కలల ప్రాజెక్ట్ , గతంలో అద్భుత విజయం సాధించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ ద్వారానే తన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ కథానాయకుడిగా సినీ రంగానికి పరిచయమవుతాడని బాలకృష్ణ తేల్చి చెప్పారు. ఈ భారీ స్థాయిలో రూపొందనున్న సినిమాకు దర్శకుడు క్రిష్ (Krish) పర్యవేక్షణ వహిస్తారని కూడా అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారి, నందమూరి అభిమానుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపాయి.

Mokshagna entry

మోక్షజ్ఞ ఎంట్రీ(Mokshagna entry) గురించి గతంలోనే చర్చ జరిగింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా రానుంది అంటూ అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ఆ ప్రాజెక్ట్ ఇంకా మొదలవలేదు. ఇప్పుడు బాలకృష్ణ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ పేరును ప్రకటించడంతో, పాత ప్రాజెక్టు ఏమైందనే చర్చ మళ్లీ మొదలైంది.

మోక్షజ్ఞ (Mokshagna entry)లాంటి వారసుడి సినీ అరంగేట్రం చాలా పటిష్ఠంగా ఉండాలి. బహుశా, సరైన స్క్రిప్ట్ దొరకడం, లేదా ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ కంటే, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చే ‘ఆదిత్య 999 మ్యాక్స్’ లాంటి విశిష్టమైన, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ద్వారా లాంచ్ చేయడమే సరైన నిర్ణయమని భావించడం వలన ఈ జాప్యం జరిగి ఉండొచ్చన్న టాక్ నడుస్తోంది.

ఒక లెజెండరీ ఫిల్మ్ సీక్వెల్‌తో ఎంట్రీ ఇవ్వడం అనేది మోక్షజ్ఞ కెరీర్‌కు పునాదిగా నిలుస్తుందని నందమూరి కుటుంబం భావించి ఉండొచ్చని సినీ క్రిటిక్స్ అంటున్నారు. ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ ప్రస్తుతానికి వాయిదా పడిందా లేదా రద్దయిందా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తానికి, అభిమానులకు మాత్రం ‘ఆదిత్య 999 మ్యాక్స్’ రూపంలో భారీ విందు ఖాయమైనట్లే!

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version