Bigg Boss
బిగ్‌బాస్(Bigg Boss తెలుగు 9 రియాలిటీ షో పదో వారంలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా మారింది. తొమ్మిదో వారంలో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్, శ్రీనివాస్ సాయి ఎలిమినేషన్‌తో మొత్తం 11 మంది కంటెస్టెంట్లు మిగిలారు. ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ బిగ్ వార్ ను తలపించింది.
ఈ వారపు నామినేషన్ ప్రక్రియలో బిగ్‌బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. హౌస్‌మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి, ప్రతి ఒక్కరూ కేవలం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలని, దీనికి గడువు కేవలం ఐదు నిమిషాలు మాత్రమేనని ప్రకటించారు. నామినేట్ అయిన కంటెస్టెంట్ తప్పనిసరిగా షవర్ కింద కూర్చోవాలి. వారిపై బురద నీరు పడుతుంది.
ఈ ప్రక్రియలో (Bigg Boss)హౌస్‌మేట్స్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ, వ్యక్తిగత , ఆటతీరుకు సంబంధించిన పాయింట్లతో నామినేట్ చేసుకున్నారు.
ఇమ్మానుయేల్ vs భరణి.. కెప్టెన్సీ టాస్క్‌లో తనూజ కోసం భరణి సులభంగా ‘గివ్ అప్’ చేయడం నచ్చలేదని ఇమ్మూ నామినేట్ చేశాడు.
రీతూ vs దివ్య నికిత.. రీతూ, దివ్యను నామినేట్ చేస్తూ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసింది. దివ్య హౌస్‌లో ‘గ్యాంగ్’ క్రియేట్ చేస్తోందని, అవసరం వచ్చినప్పుడు ఆ గ్యాంగ్‌ను బాణాల్లా వాడుకుంటోందని ఆరోపించింది. దీనికి దివ్య, “చెప్పినట్లు చేయడానికి వాళ్లందరూ చిన్న పిల్లలా?” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.
గౌరవ్ vs సంజన.. సంజన పెర్ఫామెన్స్ అసలు లేదని, ఎమోషనల్ డ్రామా ఎక్కువ అని, సెల్ఫిష్‌గా ఆడుతోందని గౌరవ్ పాయింట్స్ చెప్పాడు.
నామినేషన్ వాదోపవాదాలు.. కళ్యాణ్, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, తనూజ అంతా తమ పాయింట్స్ చెప్పి నామినేషన్లు పూర్తి చేశారు. అయితే, భరణి, దివ్యను నామినేట్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది, ఇద్దరి మధ్య గట్టి వాదన జరిగింది. సంజన గౌరవ్‌ను, నిఖిల్ రీతూను నామినేట్ చేయడంతో నామినేషన్లు రసవత్తరంగా ముగిశాయి.
సాధారణ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో, బిగ్‌బాస్ అసలైన షాక్ ఇచ్చారు.
“నా వంతు… మీ పట్ల, మీ ఆట పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిప్రాయాన్ని మీరు ఎదుర్కోవాల్సిన సమయం ఇది. అందుకే ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపేందుకు అందరినీ నేరుగా నామినేట్ చేస్తున్నాను..! ఈ నామినేషన్ మీ కళ్ళు తెరిపిస్తుందో, మీ కోసం బిగ్‌బాస్ ఇంటి గేట్లు తెరుచుకుంటాయో.. ఈ వారం మీ కోసం మీరు చేసే యుద్ధమే నిర్ణయిస్తుంది.”
అంటూ హౌస్‌లో ఉన్నవారందరినీ డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. ఈసారి బిగ్‌బాస్ ఏకంగా కెప్టెన్‌ను కూడా నామినేట్ చేయడం ఆసక్తికరమైన అంశం.
ప్రస్తుత కెప్టెన్ అయిన ఇమ్మానుయేల్‌కు ఈ డైరెక్ట్ నామినేషన్ నుంచి సేవ్ అయ్యే అవకాశాన్ని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కే వదిలేశారు. కెప్టెన్ హోదాలో వచ్చిన ఇమ్యూనిటీ ఇమ్మూకి దక్కాలా లేదా అతను నామినేట్ అవ్వాలా అనే నిర్ణయాన్ని హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా తీసుకోవాలని సూచించారు.
ఈ ఓటింగ్‌లో భరణి శంకర్ మినహా హౌస్‌లో ఉన్న మిగిలిన అందరూ ఇమ్మానుయేల్‌కు మద్దతుగా ఓటు వేశారు. దీంతో, ఇమ్మానుయేల్ మరోసారి నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యాడు.
ఫైనల్‌గా, ఇమ్మానుయేల్ మినహా హౌస్(Bigg Boss)లో ఉన్న మిగిలిన 10 మంది కంటెస్టెంట్లు ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. బిగ్‌బాస్ ఫినాలేకు కేవలం ఆరు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ మాస్ నామినేషన్ హౌస్‌లో ఆటను మరింత హీటును పెంచింది.
