Bigg Boss: బిగ్‌బాస్ రాజ్యంలో పీఠాల కలవరం.. రాణుల మధ్య మాటల యుద్ధం

Bigg Boss: బిగ్‌బాస్ ఇచ్చిన ఒక అనూహ్యమైన ట్విస్ట్‌తో (Twist), హౌస్‌లో పాత స్నేహాలు, గ్రూపుల మధ్య తీవ్రమైన విభేదాలు బయటపడ్డాయి.

Bigg Boss

బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 9 లో ప్రస్తుతం కొనసాగుతున్న ‘బీబీ రాజ్యం’ టాస్క్ (Task) ఉత్కంఠను మరింత పెంచింది. మొన్నటి వరకు హౌస్‌లో రాజులు, రాణులు, వారి ప్రజలు, కమాండర్‌లు మధ్య మాత్రమే టాస్క్‌లు నడిచాయి. తాజాగా, బిగ్‌బాస్ ఇచ్చిన ఒక అనూహ్యమైన ట్విస్ట్‌తో (Twist), హౌస్‌లో పాత స్నేహాలు, గ్రూపుల మధ్య తీవ్రమైన విభేదాలు బయటపడ్డాయి.

ప్రస్తుత ప్రజలుగా ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, భరణి, గౌరవ్ ఉండగా, కమాండర్‌లుగా డీమాన్ పవన్, సంజన, తనూజ, నిఖిల్ ఉన్నారు.

నిన్నటి ఎపిసోడ్‌లో, బిగ్‌బాస్ హౌస్‌(Bigg Boss)లోని పాలకులైన రాజు, రాణులకు (రీతూ, కళ్యాణ్, దివ్య) ఒక హెచ్చరిక ఇచ్చారు. “మీ స్థానం పదిలం కాదని నేను ముందే చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని ఓడించి మీ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి కమాండర్లు సిద్ధంగా ఉన్నారు” అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

ముందుగా, రాజులు/రాణులలో ఏ ఒక్కరు తమ స్థానాన్ని రిస్కులో పెట్టి కమాండర్‌తో పోటీపడాలనే షరతు పెట్టారు. దీంతో, రీతూ, కళ్యాణ్, దివ్య – ఈ ముగ్గురూ ఎవరు టాస్క్ ఆడాలి అని తీవ్రంగా డిస్కస్ చేసుకున్నారు. ఈ చర్చ అనూహ్యంగా రాణుల మధ్య పెద్ద గొడవకు దారితీసింది.

Bigg Boss

ఈ చర్చలో, కళ్యాణ్ మరియు రీతూ ఇద్దరూ కలిసి దాదాపుగా దివ్యను కార్నర్ (Corner) చేశారు. “బెటర్ ఛాన్సెస్ నీకు ఎక్కువగా ఉన్నాయి, నువ్వే వెళ్లి పోటీ పడు” అంటూ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చాడు. దీనిపై దివ్య రియాక్ట్ అవుతూ, “నాకు ఎవరూ ఛాన్స్ ఇవ్వట్లేదు, నాకు నేను కల్పించుకుంటున్నాను” అని బలంగా వాదించింది.

ఈ వాదన మధ్యలో, దివ్య పాత టాస్క్‌లను ప్రస్తావిస్తూ, “తనకు అంత ఛాన్స్ ఇచ్చినా గెలవలేకపోయింది” అంటూ రీతూను మధ్యలోకి లాగింది. ఈ వ్యాఖ్యతో రీతూ ఒక్కసారిగా రెచ్చిపోయింది. “నువ్వు నీ గురించి ఫైట్ చేసుకో. పక్కనోళ్లని తక్కువ చేసి ఫైట్ చేయకూడదు. నన్ను తొక్కి నువ్వు పైకి లేవకు!” అంటూ తీవ్రంగా సీరియస్ అయ్యింది.

చివరికి, ఈ గొడవతో విసిగిపోయిన కళ్యాణ్, “నిన్ను పంపించడమే కరెక్ట్ అని అనిపిస్తుంది” అని చెప్పడంతో, దివ్య “సరే, వదిలేయ్” అంటూ ఆ స్థలం నుంచి వెళ్లిపోయింది. ఈ ఎపిసోడ్, హౌస్‌లోని పాత గ్రూపు సమీకరణాలు (Group Equations) ఎలా దెబ్బతింటున్నాయో స్పష్టం చేసింది.

కొత్త రాజు కోసం ‘ఎయిమ్ ఫర్ క్రౌన్’..మరోవైపు, బిగ్‌బాస్ కమాండర్‌లకు కూడా ఒక టాస్క్ ఇచ్చారు. తమలో తాము చర్చించుకుని, ఏ స్థానాన్ని మెరుగుపరుచుకుని రాజు/రాణి అవ్వాలో నిర్ణయించుకోవాలని చెప్పారు. కమాండర్‌లు అయిన సంజన, తనూజ, డీమాన్ పవన్, నిఖిల్ మధ్య నేను ఆడతా అంటే నేను ఆడతా అని వాదనలు జరిగాయి.

అంతిమంగా, చిట్టీలు వేసిన తర్వాత డీమాన్ మరియు నిఖిల్ పేర్లు వచ్చాయి. కొత్త రాజును ఎంపిక చేయడానికి ‘ఎయిమ్ ఫర్ క్రౌన్’ అనే టాస్క్‌ను బిగ్‌బాస్ పెట్టారు. ఇందులో రాణి దివ్య,కమాండర్ నిఖిల్ పోటీ పడ్డారు. దీని ఫలితం, రాజ్యంలో వచ్చే తర్వాత జరిగే మార్పులు రాబోయే ఎపిసోడ్‌లలో మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version