Bigg Boss
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరాహోరీగా సాగుతోంది. మూడు వారంలోకి అడుగుపెట్టిన ఈ రియాలిటీ షోలో నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. ఈసారి కూడా బిగ్ బాస్ కొన్ని కండిషన్స్ పెట్టి, ఆటను మరింత ఆసక్తికరంగా మార్చాడు. ఈ వారం ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లిస్టులో చేరారు.
ఈ వారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్(Bigg Boss) ఒక కొత్త రూల్ పెట్టాడు. ఇంటి సభ్యులు ఐదుగురిని నామినేట్ చేయాలని, అయితే అందులో తప్పనిసరిగా ఒక టెనెంట్‌ను నామినేట్ చేయాలని షరతు పెట్టాడు. దీంతో హరీశ్, ప్రియ, శ్రీజలు సంజనను నామినేట్ చేశారు. అదే విధంగా రీతూ చౌదరి, సుమన్, ఫ్లోరాను నామినేట్ చేశారు. చివరికి, అందరూ కలిసి ఒక టెనెంట్‌ను నామినేట్ చేయాలని చెప్పడంతో, హరీశ్‌ను అంతా కలిసి నామినేషన్స్‌లో నిలబెట్టారు.
మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ఇంట్లో ఒక చిన్న యుద్ధాన్నే తలపించింది. శ్రీజ,హరిత హరీష్, ప్రియా, సంజన, ఫ్లోరా సైనీ, ఇమ్మాన్యుయేల్, భరణి.. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈ వారం నామినేషన్స్‌లో రాము రాథోడ్, రీతూ చౌదరి, ప్రియ, హరిత హరీష్, కల్యాణ్, ఫ్లోరా షైనీతో కలిపి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.
ఇప్పటికే బిగ్ బాస్ (Bigg Boss) ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఈ వారం నామినేషన్స్‌లో ఇంకేమైనా మార్పులు ఉంటాయేమో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవారు..ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మొదటి వారంలో సెలబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా, రెండవ వారంలో కామనర్ల నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, బిగ్ బాస్ (Bigg Boss)ఇంకా ఎలాంటి ట్విస్టులు ఇస్తాడో చూడాలి.