Bigg Boss: తెలుగు బిగ్ బాస్ 9 సీజన్‌పై నిషేధపు సెగ..ఈసారి షో ఆగిపోతుందా?

Bigg Boss: షో సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, నైతిక విలువల పతనాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Bigg Boss

రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్(Bigg Boss) మరోసారి వివాదంలో చిక్కుకుంది. షో సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, నైతిక విలువల పతనాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి వంటి ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులో ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి వంటి కొందరు కంటెస్టెంట్లు కుటుంబ విలువలకు, నైతికతకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిని షోలోకి తీసుకోవడం ద్వారా సమాజానికి ముఖ్యంగా యువతకు ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు.

ఈ షోను నిషేధించకపోతే, మహిళా సంఘాలు , ప్రజా సంఘాలతో కలిసి బిగ్ బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని, కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కూడా షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

Bigg Boss

అయితే తెలుగు బిగ్ బాస్(Bigg Boss) ప్రారంభమైనప్పటి నుంచే దాని కంటెంట్ మరియు కంటెస్టెంట్ల ఎంపికపై తరచుగా ఫిర్యాదులు, వివాదాలు వస్తూనే ఉన్నాయి.

ముందుగా 2023 సీజన్ 7 లో కంటెంట్ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, గ్రాండ్ ఫినాలే తర్వాత ఫ్యాన్స్ మధ్య జరిగిన ఘర్షణలకు నిర్వాహకులే కారణమని ఆరోపిస్తూ తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (HRC) కు హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు. షో నిలిపివేయబడలేదు. నిర్వాహకులు, హోస్ట్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు, కానీ షో ప్రసారం కొనసాగింది.

2019 సీజన్ 3 కంటెస్టెంట్ల ఎంపికలో లైంగిక వేధింపుల ఆరోపణలు (Sexual Harassment), బూతు కంటెంట్ ప్రదర్శన. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేయబడింది. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. షో నిలిపివేయబడలేదు. హైకోర్టులో పిల్ దాఖలైనా కూడా, షో యజమాన్యం క్వాష్ పిటిషన్ వేయడంతో షో ప్రసారం అయింది. రాత్రి 11 గంటల తర్వాతే ప్రసారం చేయాలని పిటిషనర్ కోరినా అది కూడా అమలు కాలేదు.

Bigg Boss

2018 సీజన్ 2 యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ కంటెంట్‌పై అభ్యంతరం. మానవ హక్కుల కమిషన్‌ (HRC) లో ప్రముఖ న్యాయవాది ఫిర్యాదు. షో నిలిపివేయబడలేదు. ప్రసారం నిరాటంకంగా కొనసాగింది.

గతంలో ఎన్ని ఫిర్యాదులు, ఆరోపణలు, కోర్టు కేసులతో పాటు హైకోర్టులో పిల్ దాఖలైనా కూడా తెలుగు బిగ్ బాస్ షో నిలిచిపోలేదు. ఈ రియాలిటీ షోకు ఉన్న అపారమైన ప్రజాదరణ , టెలివిజన్ రేటింగ్స్ (TRP) కారణంగా, ప్రసారాలను ఆపడం సాధ్యం కాలేదు.

అయితే, ఈ తాజా ఫిర్యాదుతో ప్రభుత్వం కఠినంగా స్పందించి, ప్రజారోగ్యంతో పాటు సామాజిక ఆరోగ్యంతో పాటు కుటుంబ విలువలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Modi: ప్రధాని మోదీకి కూటమి ప్రభుత్వ సత్కారం.. మల్లికార్జునస్వామి సన్నిధిలో మరుపురాని క్షణాలు

Exit mobile version