Bigg Boss: బిగ్‌బాస్ 9లో ఊహించని ట్విస్ట్.. శ్రీనివాస్ సాయి అవుట్..!

Bigg Boss: మరో ఐదు వారాల్లో విజేత ఎవరో తేలనున్న ఈ సమయంలో, 9వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఒక డబుల్ ట్విస్ట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

Bigg Boss

బిగ్‌బాస్(Bigg Boss) తెలుగు 9 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న సమయంలో హౌస్‌లో ఆసక్తికరమైన, ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరో ఐదు వారాల్లో విజేత ఎవరో తేలనున్న ఈ సమయంలో, 9వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఒక డబుల్ ట్విస్ట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

9వ వారం నామినేషన్లలో సుమన్ శెట్టి, భరణి శంకర్, సంజన గల్రానీ, పవన్ కళ్యాణ్ పడాల, రాము రాథోడ్, శ్రీనివాస్ సాయి, తనూజ పుట్టస్వామి..ఇలా మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు..

వారంలో కీలక పరిణామంగా, బలమైన కంటెస్టెంట్‌లలో ఒకరైన రాము రాథోడ్ తన ‘హోమ్ సిక్’ కారణంగా (Bigg Boss)హౌస్‌ను వీడతానని పట్టుబట్టడంతో, నాగార్జున అతన్ని సెల్ఫ్ ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాము ఆటలో మంచి ఫైర్ చూపించినాక ూడా, వ్యక్తిగత కారణాలతో మధ్యలోనే వెళ్లిపోవడంతో, ఈ వారం ఎలిమినేషన్ ఉండదని లేదా కేవలం ఒక్కరే ఉంటారని అంతా భావించారు. అయితే, బిగ్‌బాస్ టీమ్ ముందు నుంచీ లీకులు ఇచ్చినట్లుగా డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ అమలు చేసింది. రాము స్వయంగా వెళ్లిపోయినా, ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించింది.

Bigg Boss

ఈ అనూహ్య పరిణామంలో, శ్రీనివాస్ సాయి హౌస్‌ను వీడాల్సి వచ్చింది. రాము సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడంతో తాను ఈ వారం గట్టెక్కానని సాయి భావించినా పాపం.. అత్యల్ప ఓటింగ్ కారణంగా అతని ఆశలు అడియాశలయ్యాయి.

శ్రీనివాస్ సాయి, వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. గతంలో కొన్ని చిత్రాల్లో నటించినా సరే, బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాతే ప్రేక్షకులకు ఆయన సుపరిచితమయ్యారు. అయితే, హౌస్‌లో ఉన్న నాలుగు వారాల వ్యవధిలో, అతను తన మార్కును బలంగా చూపించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.

స్క్రీన్ స్పేస్ మరియు మైండ్ గేమ్.. టాస్క్‌లు మరియు మైండ్ గేమ్‌ల విషయంలో ఆయన వెనుకబడి ఉండటం ప్రధాన లోపంగా మారింది.

నెగిటివ్ మైండ్‌సెట్.. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రవర్తన జనాలలో ‘కన్నింగ్ మైండ్ సెట్’గా సంకేతాలు పంపడంతో, అది ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అనధికారిక ఓటింగ్ శాతం ప్రకారం శ్రీనివాస్ సాయి కేవలం 8.63 శాతం ఓట్లతో అందరికంటే చివరి స్థానంలో నిలిచారు. పవన్ కళ్యాణ్ పడాల (21.5%), తనూజ పుట్టస్వామి (16.87%) వంటి వారితో పోలిస్తే, సాయి శ్రీనివాస్ మరియు భరణి శంకర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు స్పష్టమైంది. అతి తక్కువ ఓటింగ్ నమోదు కావడంతో, బిగ్‌బాస్ టీమ్ ఆయన్ని బయటకు పంపడమే సరైన నిర్ణయమని భావించింది.

బిగ్‌బాస్ (Bigg Boss)నుంచి నిష్క్రమించినా కూడా.. శ్రీనివాస్ సాయికి ఈ షో మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే, శ్రీనివాస్ సాయి హౌస్‌లో ఉన్న నాలుగు వారాలకు గాను, వారానికి సుమారు 2 లక్షల రూపాయల చొప్పున, మొత్తం 8 లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ వేదికపై దక్కిన గుర్తింపు అతని సినిమా కెరీర్‌కు కచ్చితంగా ఉపయోగపడుతుందని అతని అభిమానులు అంటున్నారు.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version