OG
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, సినీ ప్రేమికులకు పండగే అని చెప్పాలి. పవన్ ఫ్యాన్స్, జనసైనికులే కాకుండా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ(OG)’ (ఓజాస్ గంభీరా) సినిమా ప్రీమియర్ షోల సమయాలను మార్చారు. స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న ఓజీ (OG )సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైలిష్ యాక్షన్, సుజిత్ టేకింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయని ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాపై ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఓజీ’ సినిమాకు స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది. మొదట, సెప్టెంబర్ 25 అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ షోలకు పర్మిషన్ లభించగా, తాజాగా ఈ సమయాలను మార్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు, స్పెషల్ షోలను సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటల నుంచే ప్రదర్శించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణలో కూడా ‘ఓజీ’ స్పెషల్ షోలకు అనుమతి లభించింది. అక్కడ కూడా సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ‘ఓజీ’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.