Chiru, Venky:ఒకే స్టేజీపై చిరు,వెంకీ,నయనతార..ఈ మెగా ఈవెంట్‌ ఎక్కడ? ఎప్పుడు?

Chiru, Venky: సాధారణంగా ఇద్దరు పెద్ద హీరోలు కలిసి ఒక సినిమాలో నటించడం వేరు.. కానీ పబ్లిక్ లో ఒకే స్టేజీ మీద కనిపించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం

Chiru, Venky

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర తన అసలు పేరుతోనే సందడి చేయబోతుండటంతో ఫ్యాన్స్ దీనికోసం తెగ వెయిట్ చేస్తున్నారు. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసుకున్నారు.

కేవలం చిరంజీవి (chiru) మార్క్ కామెడీ మాత్రమే కాకుండా, ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ (Venky) ఒక కీలకమైన గెస్ట్ రోల్ లో కనిపించబోతుండటం ఈ పండుగ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది. సినిమా విడుదల తేదీ జనవరి 12 అని ఇప్పటికే అనౌన్స్ చేయగా.. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ పై ఉంది.

Chiru, Venky

దీనికి సంబంధించి మూవీ యూనిట్ తాజాగా అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. జనవరి 7న హైదరాబాద్ లో ఈ వేడుకను అత్యంత గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.ఈ ఈవెంట్ లో చిరంజీవి, వెంకటేష్ (Chiru, Venky) ఇద్దరూ ఒకే వేదికపై కనిపించి అభిమానులను ఉర్రూతలూగించనున్నారు. వీరిద్దరితో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా హాజరు కానున్నారన్న వార్త ఈ వేడుకకు గ్లామర్ అదనపు ఆకర్షణ కానుంది.

సాధారణంగా ఇద్దరు పెద్ద హీరోలు(Chiru, Venky) కలిసి ఒక సినిమాలో నటించడం వేరు.. కానీ పబ్లిక్ లో ఒకే స్టేజీ మీద కనిపించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అందుకే ఈ క్షణం కోసం మెగా , దగ్గుబాటి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ ఈవెంట్ ను ఏదైనా ఓపెన్ గ్రౌండ్ లో భారీ జనం మధ్య చేస్తారా లేదా లగ్జరీ హోటల్ లో సెలబ్రిటీల సమక్షంలో నిర్వహిస్తారా అనే విషయంపై చిన్నపాటి సస్పెన్స్ ఉన్నా కూడా, ఏర్పాట్లు మాత్రం ఓ రేంజ్ లో జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది.

Rashi:శివాజీ,అనసూయ మధ్యలో రాశి..నెక్స్ట్ ఎవరు? ..సారీతో శుభం కార్డు పడేనా?

Exit mobile version