Avatar : అవతార్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్..

Avatar : జేమ్స్ కామెరూన్(James Cameron) సృష్టించిన విజువల్ వండర్ ఫ్రాంచైజీ 'అవతార్' కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Avatar : జేమ్స్ కామెరూన్(James Cameron) సృష్టించిన విజువల్ వండర్ ఫ్రాంచైజీ ‘అవతార్’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సిరీస్‌కి మూడో భాగంగా వస్తున్న ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 2025 డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ మూవీ, మంగళవారం రిలీజయిన ఈ పోస్టర్‌తో అంచనాలను ఆకాశానికి చేర్చింది. పండోరా గ్రహంపై మరో ఉత్కంఠభరితమైన అధ్యాయానికి ఇది నాంది పలుకుతోంది.

Crazy update for Avatar fans

వైరల్ అవుతున్న ఈ పోస్టర్ ‘వరంగ్'(Varang) అనే కొత్త పాత్రకు సంబంధించింది కావడం విశేషం. ఈ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో బ్రిటీష్ నటి ఊనా చాప్లిన్ నటిస్తున్నారు. పోస్టర్‌లో ఆమె మేఘాల మధ్య అగ్నిలా నిలబడి, ముఖంలో కోపం, కళ్లలో యుద్ధానికి సిద్ధమన్నట్లు కనిపిస్తున్నారు. తన వెనుక అలజడి, పొగలు, అగ్నికీలలు చుట్టూ చుట్టుముట్టినట్టు చూపించడంతో, పండోరా( Pandora)లో మరో ప్రమాదకరమైన పోరాటానికి రంగం సిద్ధమైందన్న ఫీలింగ్ కలుగుతోంది. ‘ఫైర్ అండ్ యాష్’ అనే టైటిల్‌కు తగ్గట్టే, ఈసారి కథ అగ్ని కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందని సినీ వర్గాల నుంచి టాక్.

అవతార్ ఫ్యాన్స్‌కు మరో అప్‌డేట్ కూడా వచ్చింది. 2025 జూలై 25న ‘ది ఫాంటాస్టిక్ ఫోర్.. ఫస్ట్ స్టెప్స్’ థియేటర్లలో రిలీజ్ కానుంది. సరిగ్గా అదే రోజు, ‘అవతార్ 3’ ట్రైలర్‌ను బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి, ఈ వారం థియేటర్‌కు వెళ్లే ప్లాన్‌లో ఉన్నవాళ్లు ‘ఫాంటాస్టిక్ ఫోర్’ చూస్తే చాలు, విజువల్ వండర్‌గా రానున్న ‘అవతార్ 3’ ట్రైలర్‌ను పెద్ద తెరపైనే ఆస్వాదించవచ్చు. ఇది అభిమానులకు పండగే అని చెప్పాలి.

దర్శకుడు జేమ్స్ కామెరూన్ తన మొదటి ‘అవతార్’ చిత్రంతో పండోరా అనే కల్పిత గ్రహాన్ని పరిచయం చేసి, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆడియన్స్‌ను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సునామీని సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన రెండో భాగం, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కూడా ప్రేక్షకులకు సరికొత్త విజువల్స్‌ను అందించింది. దాదాపు 160 భాషల్లో విడుదలైన ఈ సీక్వెల్, ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు నమోదు చేసి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మూడో భాగంతో మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.

‘అవతార్'(Avatar) ఫ్రాంచైజీ ఇక్కడితో ఆగిపోవడం లేదు. మూవీ టీమ్ ఇప్పటికే రాబోయే భాగాల గురించి కీలక ప్రకటన చేసింది. నాలుగో భాగం ‘అవతార్ 4’ను 2029లో, ఇక ఐదో భాగం ‘అవతార్ 5’ను 2031 డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇది జేమ్స్ కామెరూన్ విజన్‌కు నిదర్శనం అంటున్నారు ఫ్యాన్స్. ఈ ఫ్రాంచైజీ రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

 

 

Exit mobile version