Deepika Padukone
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకునే(Deepika Padukone) గత కొంతకాలంగా సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. సాధారణంగానే చాలా మంది హీరోయిన్లకు కాస్త ఆటిట్యూడ్ ఉంటుంది. ఈ విషయంలో దీపికాకు కాస్త ఎక్కువే ఉందంటూ కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. ఈ కారణంగానే పలు పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పించారనో…తప్పకుందనే వార్తలు ఎక్కువగా వచ్చాయి.
ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న స్పిరిట్..అలాగే కల్కి సీక్వెల్ నుంచి కూడా తప్పుకుంది. తాజాగా దీనిపై దీపికా పదుకునే(Deepika Padukone) స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఎక్కువ కండీషన్లు పెట్టడం వల్లనే తనను తప్పించారంటూ వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆత్మాభిమానం ఉన్న నటిగా తనను ఇబ్బందిపెట్టే విషయాలను అంగీకరించలేనని చెప్పింది. పని గంటల విషయంలో తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించింది. భారత చిత్రపరిశ్రమలో చాలా మంది స్టార్స్ ఎన్నోఏళ్లుగా 8 గంటలు పని చేస్తున్నారనీ, ఇదేం కొత్త విషయం కాదని వ్యాఖ్యానించింది.
ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కూడా ఇది వార్తల్లోకి రాలేదని, తాను మాట్లాడితే మాత్రం హడాడవుడి చేస్తున్నారంటూ ఫైర్ అయింది. చాలా మంది హీరోలు 8 గంటల కూడా పనిచేయరని, వాళ్ళ పేర్లు కూడా తాను చెప్పాలనుకోవడం లేదని పేర్కొంది. వాళ్ళను ఎందుకు ప్రశ్నించడం లేదో మరి అంటూ సెటైర్లు వేసింది. కొందరు మేల్ హీరోలు వారంలో ఐదురోజులే పనిచేస్తుంటారని, వారిని కూడా ఎవరూ అడగరంటూ మండిపడింది.
తాను ప్రశ్నించడాన్ని వారంతా అతి అని భావిస్తే ఏం పర్వాలేదంటూ వ్యాఖ్యానించింది. మహిళలు అడిగినప్పుడు మాత్రం తెగ చర్చ చేస్తుంటారంటూ కౌంటర్ ఇచ్చింది. తానెప్పుడూ దేనిపైనా ఓపెన్ గా రియాక్ట్ కానని తెలిపింది. సైలెంట్ గా యుద్ధం చేయడమే తనకు తెలుసంటూ చెప్పుకొచ్చింది. చాలా మంది హీరోయిన్లు తల్లయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయని, దానికి తగ్గట్టుగా వర్క్ టైమింగ్స్ అడగడంలో తప్పేముందని దీపిక ప్రశ్నించింది.
ఈ విషయాన్నే తప్పుగా క్రియేట్ చేసి ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. దీపికా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపికా(Deepika Padukone) డిమాండ్ల కారణంగానే కల్కి 2898 AD సీక్వెల్ నుంచి ఆమెను తప్పించారన్న వార్తలు వినిపించాయి. 8 గంటలే పని చేస్తానని చెప్పడం, రెమ్యునరేషన్ తో పాటు తన స్టాఫ్ కు లగ్జరీ హోటల్ లో వసతి వంటి డిమాండ్లు నిర్మాతలకు ఇబ్బందిగా మారినట్టు భావిస్తున్నారు.