Hari Hara Veer Mallu: నేషనల్ హెడ్‌లైన్స్‌లో ‘వీరమల్లు’ప్రభంజనం..

Hari Hara Veer Mallu:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగే పండుగ. ఒక్కో అప్‌డేట్‌తో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్న హరి హర వీరమల్లు రిలీజ్‌కు ఇక రెండు వారాలే టైమ్ ఉంది.

Hari Hara Veer Mallu:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగే పండుగ. ఒక్కో అప్‌డేట్‌తో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్న హరి హర వీరమల్లు రిలీజ్‌కు ఇక రెండు వారాలే టైమ్ ఉంది. ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచిన మూవీ టీమ్, ఫ్యాన్స్‌లో అంచనాలను డబుల్ చేస్తోంది. కేవలం టాలీవుడ్ సినిమా కాదు, పవర్‌స్టార్ తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో పవన్.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడతారా? నేషనల్ లెవెల్‌లో ‘వీరమల్లు’ ప్రభంజనం ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ పవన్ ఫ్యాన్స్ లో పెరిగిపోతోంది.

Hari Hara Veer Mallu

ట్రైలర్‌తో డబుల్ అయిన అంచనాలు ..

మోస్ట్ అవెయిటెడ్ హరి హర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత ‘వీరమల్లు’పై అంచనాలు ఒకటికి రెండు రెట్లు పెరిగాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఒకసారిగా ఆడియన్స్‌లో పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది, ఈ జోష్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

పొలిటికల్ విక్టరీ ఎఫెక్ట్: వీరమల్లుకు ప్లస్ పాయింట్..

ఇప్పటికే పవన్ కళ్యాణ్ పొలిటికల్ విక్టరీతో నేషనల్ లెవల్‌లో న్యూస్ మేకర్ అయ్యారు. ఇప్పుడు ఆయన తొలి పాన్ ఇండియా సినిమా కూడా అదే రేంజ్‌లో బజ్ క్రియేట్ చేయడం పక్కా అని పవర్‌స్టార్ ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్, ఆయనకున్న ప్రజాదరణ ఈ సినిమాకు అదనపు బలాన్ని చేకూరుస్తున్నాయి. దీనికి తోడు, సినిమా నుంచి వస్తున్న వరుస అప్‌డేట్స్ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.

బాక్సాఫీస్ రికార్డులు తారుమారు పక్కా అంటూ క్రిటిక్స్ అంచనాలు..

ఇండియన్ స్క్రీన్ మీద ఒక భారీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయి చాలా కాలం అవుతోంది. ఇది కూడా ‘వీరమల్లు’కు కలిసొచ్చే అంశమే అంటున్నారు సినీ క్రిటిక్స్. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా… బాక్సాఫీస్ రికార్డులు తారుమారు కావడం పక్కా అని అంచనా వేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరమల్లు మ్యానియాతో ఊగిపోతున్నారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో నేషనల్ హెడ్‌లైన్స్‌లో వీరమల్లు ..

‘హరి హర వీరమల్లు’ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశం కాబోతోంది. అందుకు ప్రధాన కారణం, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వార్తలు. భారీగా ప్లాన్ చేస్తున్న ఈ ఈవెంట్‌కు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారన్న వార్త ప్రస్తుతం ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇది ‘వీరమల్లు’ను ఇప్పటి నుంచే నేషనల్ హెడ్‌లైన్స్‌లో నిలబెడుతోంది.

Exit mobile version