Home Bound : ఆస్కార్ బరిలో జాన్వీకపూర్ మూవీ..హోమ్ బౌండ్ నామినేట్

Home Bound : హోమ్ బౌండ్ మూవీ కోసం పలువురు హాలీవుడ్ నిపుణులు కూడా పనిచేశారు. హాలీవుడ్‌ కు చెందిన మార్టిన్‌ స్కోర్సెస్‌ ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు

Home Bound

వరల్డ్ సినిమాలో అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ అవార్డ్ హంగామా మళ్ళీ మొదలైంది. ఆరు నెలల ముందుగానే నామినేషన్ల హడావుడి షురూ అయింది. ఎప్పటిలానే ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలకు చెందిన అత్యుత్తమ సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఈ సారి భారత్ నుంచి అధికారికంగా ఓ చిత్రం నామినేట్ అయింది. విడుదల కాకముందే పలు రికార్డులు సృష్టిస్తున్న హిందీ మూవీ హోమ్ బౌండ్ ఆస్కార్ నామినేషన్స్ కు అర్హత సాధించింది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ, దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన హోమ్ బౌండ్ మూవీకి నీరజ్ గేవాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జాన్వీతో పటు ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించారు.

Home Bound

సెప్టెంబర్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీని కరణ్‌ జోహార్ తో పాటు అదార్‌ పూనావాలా, సోమెన్‌ మిశ్రా, అపూర్వ మెహతా కలిసి నిర్మించారు. విడుదల కాక ముందే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో హోమ్ బౌండ్ మూవీ ప్రదర్శించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంచి చోట్ల విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆస్కార్ అవార్డుల కోసం ది బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ విభాగంలో ఈ చిత్రం పోటీ పడనుంది. హోమ్ బౌండ్ చిత్రం నామినేట్ అవడం సంతోషంగా ఉందని సెలక్షన్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ ఎన్‌ చంద్ర చెప్పారు. భారత్ నుంచి ఈ ఏడాది ఆస్కార్ ఎంట్రీ కోసం మొత్తం 24 సినిమాలు పోటీ పడడం… అన్నీ అద్భుతమైనవే కావడంతో ఎంపిక కష్టమైందని చెప్పారు. 24 సినిమాల నుంచిసెలక్షన్ కమిటీ అత్యుత్తమంగా హోమ్‌ బౌండ్‌ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.

కాగా హోమ్ బౌండ్ మూవీ కోసం పలువురు హాలీవుడ్ నిపుణులు కూడా పనిచేశారు. హాలీవుడ్‌ కు చెందిన మార్టిన్‌ స్కోర్సెస్‌ ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ రిలీజ్‌ను ఆయనే చూసుకుంటున్నారు. కథ విషయానికొస్తే నార్త్‌ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్‌ ఆఫీసర్లుగా స్థిరపడడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. దీని కోసం చాలా కష్టపడతారు.. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఆ ఇద్దరు స్నేహితులు ఏం చేశారు… ఈ క్రమంలో వారి లైఫ్ లోకి ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది సినిమా కథ. మరి విదేశీ చిత్రాల పోటీని తట్టుకుని జాన్వీ కపూర్ మూవీ ఆస్కార్ సాధిస్తుందేమో చూడాలి. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం వచ్చే ఏడాది మార్చి 15న జరుగుతుంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version