Kantara Chapter 1: 2 రోజుల్లోనే రూ.130 కోట్లు కాంతారా చాప్టర్ 1 కలెక్షన్ల వర్షం

Kantara Chapter 1: రిషబ్‌ శెట్టి, రుక్మిణీ వసంత్‌ హీరో,హీరోయిన్లుగా నటించిన కాంతారా చాప్టర్ 1 కథ ఎనిమిదో శతాబ్దంలోని కదంబ రాజ్యం నేపథ్యంలో సాగుతుంది.

Kantara Chapter 1

మూడేళ్ళ క్రితం రిలీజయిన కాంతారా మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో సూపర్ హిట్టుగా నిలిచి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1(Kantara Chapter 1) కూడా అదే స్థాయిలో దుమ్మురేపుతోంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వలో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

హోంబలే ఫిలిమ్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించిన కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1) అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నట్టు అనిపించినా సెకండాఫ్ లో రిషబ్ శెట్టి అద్భుతమైన నటనతో మ్యాజిక్ చేశాడు. ఫలితంగా విడుదలైన అన్ని భాషల్లోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

తొలిరోజు నుంచే చాలా థియేటర్లు హౌస్ ఫుల్స్ తో రన్ అయ్యాయి. దీంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. రూ.89 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్‌ వసూలు చేస్తూ సంచలనం సృష్టించింది. కన్నడ సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఇదే తొలిసారి. బుక్ మై షోలో కూడా 1,28 మిలయన్లకు పైగా టికెట్లు అమ్ముడవడం కూడా రికార్డుహా నిలిచింది.

Kantara Chapter 1

హిట్ టాక్ రావడంతో రెండోరోజు కూడా భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. వీకెండ్ కావడంతో రెండో రోజు మరో రూ.45 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా రెండ్రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. మొత్తం రూ.135 కోట్లు వసూలు చేసింది. శని, ఆదివారాలు కూడా ఇదే స్థాయిలో కలెక్షన్లు రాబడితే మాత్రం నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని సినీవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రిషబ్‌ శెట్టి, రుక్మిణీ వసంత్‌ హీరో,హీరోయిన్లుగా నటించిన కాంతారా చాప్టర్ 1 కథ ఎనిమిదో శతాబ్దంలోని కదంబ రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. ఆ రాజ్యంలో ఉన్న అటవీ ప్రాంతం కాంతార దైవిక భూమిగా భావిస్తూ గిరిజన తెగకు చెందిన ప్రజలు కాపాడుకుంటూ ఉంటారు.

నదిలో దొరికిన చిన్నారిని( రిషబ్ శెట్టి)ని దైవంగా భావించి పెంచి పెద్ద చేస్తారు. తరువాత కాలంలో భాంగ్రా యువరాజుకాంతార ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడం, దానిని కాపాడుకునే క్రమంలో రిషబ్ శెట్టి ఏం చేశాడనేది అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా రిషబ్‌ శెట్టి దర్శకుడిగా, నటుడిగా మరోసారి తన టాలెంట్ ఏంటనేది నిరూపించుకున్నాడు. వీఎఫ్ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు నటీనటుల యాక్టింగ్ అన్ని అంశాలు బాగా కుదరడంతో హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version