Kuberaa: మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధనుష్, నాగార్జునల బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘కుబేర’ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ, జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అయ్యి, ఏకంగా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ ఎమోషనల్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Kuberaa
ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మన్మథుడు అక్కినేని నాగార్జున కలిసి నటించిన ‘కుబేర’ మూవీ థియేటర్లలో రికార్డులు క్రియేట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇంట్లో కూర్చుని చూసే అవకాశం వచ్చింది. జూలై 18 అర్ధరాత్రి నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. డిలీటెడ్ సీన్స్‌తో పాటు రష్మిక సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తోంది. ఫ్యాన్స్‌కి, వీకెండ్ ఓటీటీ మూవీల కోసం చూసేవారికి ఇది పండగలాంటి వార్తే మరి.
శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ధనుష్ భిక్షగాడిగా నటించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్‌కి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. నాగార్జున కూడా పవర్‌ఫుల్ రోల్‌లో మెరిశారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్ఫ్ తో పాటు దలీప్ తహిల్, సాయాజీ షిండే, దివ్య దేకటే, హరీష్ పెరడి వంటి ఆర్టిస్టులు కీ రోల్స్‌లో కనిపించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ కలిసి ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్‌ను ప్రొడ్యూస్ చేశాయి. థియేటర్లో దుమ్ము దులిపిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.