Ravi Teja: ఆ ఫీల్డ్‌లోకి మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ..

Ravi Teja :ART మల్టీప్లెక్స్‌లో తొలి సినిమాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్ డమ్' మూవీ రానుంది.

Ravi Teja : టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు కేవలం వెండితెరపైనే కాదు, థియేటర్ల యజమానులుగానూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అగ్రతారలు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టగా, తాజాగా ఈ జాబితాలోకి మాస్ మహారాజా రవితేజ కూడా చేరారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఆయన హైదరాబాద్‌లో నిర్మించిన లగ్జరీ మల్టీప్లెక్స్ ART (ఏషియ‌న్ ర‌వితేజ) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.

Ravi Teja

హైదరాబాద్‌లో సినిమా అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లిన వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందున్నారు. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఉంది. ఇది హైదరాబాద్‌లోనే అత్యంత విలాసవంతమైన మల్టీప్లెక్స్‌లలో ఒకటి.

అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏఏఏ సినిమాస్ (AAA Cinemas) పేరుతో అమీర్‌పేటలోని మైత్రీవనంలో అత్యాధునిక మల్టీప్లెక్స్‌ను నెలకొల్పారు.

ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా మహబూబ్‌నగర్‌లో తన ఏవీడీ సినిమాస్ (AVD Cinemas) ను ప్రారంభించి, థియేటర్ వ్యాపారంలోకి దూకారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లో ఈ స్టార్ హీరోల మల్టీప్లెక్స్‌లు తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా, మాస్ మహారాజా రవితేజ, ఏషియన్ సినిమాస్‌తో భాగస్వామ్యమై ART మల్టీప్లెక్స్‌ను నిర్మించాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో అత్యాధునిక హంగులతో, మొత్తం ఆరు స్క్రీన్‌లతో ఈ లగ్జరీ మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంది. ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం బుధవారం (జులై 30) రోజు జరగనుంది. ఈ వేడుకకు రవితేజతో పాటు పలువురు స్టార్ హీరోలు, సెలబ్రెటీలు హాజరుకానున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు.

కాగా, ART మల్టీప్లెక్స్‌లో తొలి సినిమాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్ డమ్’ మూవీ రానుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజ థియేటర్‌లో ఫస్ట్ మూవీగా విజయ్ దేవరకొండ సినిమా రావడంపై విజయ్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా హీరోలిద్దరూ తమ తమ ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటూ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

Exit mobile version