Mega Family : వారసుడొచ్చేశాడు..రాంచరణ్ దంపతులకు ట్విన్స్

Mega Family : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ , ఉపాసన దంపతులకు కవలలు పుట్టారు

Mega Family

మెగాఫ్యామిలీలో సంబరాలకు వేళయింది. అటు మెగాస్టార్ కుటుంబం, ఇటు మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన శుభతరుణం రానే వచ్చింది. మెగా ఫ్యామిలీ(Mega Family)కి వారసుడొచ్చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ , ఉపాసన దంపతులకు కవలలు పుట్టారు. ఈ మేరకు మెగా కుటుంబం సన్నిహితులు శుభవార్త చెప్పారు. ముందు నుంచీ అనుకున్నట్టుగానే జనవరి 31న ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. బాబు, పాప పుట్టినట్టు మెగా ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి.

దీనిపై ఆదివారం ఉదయం మెగా కుటుంబం(Mega Family) అధికారికంగా ప్రకటన చేయనుంది. కాగా రామచరణ్ కు, ఉపాసనకు 2012లో వివాహం జరిగింది. ఈ దంపతులు పిల్లల కోసం సమయం తీసుకోవడం కాస్త విమర్శలు రావడం, వాటికి కౌంటర్ ఇవ్వడం జరిగాయి. 2023లో ఉపాసన పాపకు జన్మనిచ్చారు, ఆమెకు క్లీంకార అని నామకరణం కూడా చేయగా… పాప ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.

అయితే పలు సందర్భాల్లో వారసుడి కోసం మెగాస్టార్ చిరంజీవి ఆత్రంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.పలు ఇంటర్యూల్లో చిరు కూడా చరణ్ కు కొడుకు పుట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ఇప్పుడు కవలల రూపంలో అది నిజమైంది.

Mega Family

గత కొన్ని రోజులుగా ఉపాసనకు కవలలు పుట్టబోతున్నారన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఆ మధ్య ఉపాసన శ్రీమంతం ఫోటోలు వైరల్ కావడం, తర్వాత వైద్యులు ఆమెకు ట్విన్స్ అని ధృవీకరించిన వార్తలు వచ్చాయి. సాధారణంగా స్కానింగ్ లో కనుక కవలలు అని తేలినప్పుడు వైద్యులు ముందుగానే కాబోయే తల్లిదండ్రులతో చెబుతారు.

తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన వార్తలు బాగా ప్రచారమయ్యాయి. ఇదిలా ఉంటే చరణ్ దంపతులకు ట్విన్స్, అందులో బాబు ఉండడం అభిమానులకు మరింత ఆనందాన్నిచ్చింది. మెగా కుటుంబానికి వారసుడు ఉండాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చరణ్ తర్వాత టాలీవుడ్ లో మెగాస్టార్ వారసత్వం కొనసాగేలా బాబు పుట్టాలని వారంతా కోరుకున్నారు. ఇప్పుడు తమ కోరిక ఫలించినందుకు మెగా అభిమానులు సంబరపడుతున్నారు.

Non Vegetarian:భారతదేశంలో పెరుగుతున్న మాంసాహారులు. . ఎవరేం తినాలనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు??

Exit mobile version