Megastar
కొన్నికొన్ని ఆనందాలు వర్ణించలేనంత గొప్పగా ఉంటాయి. మరికొన్ని అనుభూతులు కళ్లల్లో ఆనందబాష్పాలు తెప్పిస్తూ గుండెను తేలిక చేస్తాయి. ఫిబ్రవరి 1 అపోలో హాస్పిటల్ ముంద వద్ద నిలబడిన మెగాస్టార్(Megastar )చిరంజీవి గారిని చూస్తే అదే అనిపించింది. ప్రపంచం మెచ్చే నటుడు, కోట్లాదిమందికి ఆరాధ్య దైవం.. కానీ ఆ క్షణం ఆయనను చూస్తే.. కేవలం ఒక మురిసిపోతున్న తాతయ్య మాత్రమే కనిపించారు.
తన కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనలకు కవలలు జన్మించారి మీడియా ముందు చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో కనిపించిన ఆ తడి, గొంతులో పలికిన ఆ ఉద్వేగం.. ప్రతి మెగా అభిమానిని కదిలించింది. ఇది మా కుటుంబానికి దేవుడు ఇచ్చిన డబుల్ బ్లెస్సింగ్ అంటూ చిరు పలికిన ఆ మాటలు ఎంతోమందిని హత్తుకున్నాయి.
సుమారు 20 నిమిషాల పాటు సాగిన ఈ ప్రెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంతోషంతో కొణిదెల , కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయామని ఆయన తెలిపారు.జనవరి 31 రాత్రి 11:15 గంటలకు బాబు 2.8 కేజీల బరువుతో, 11:20 గంటలకు పాప 2.6 కేజీలతో పుట్టారని.. తల్లి , చిన్నారులు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అపోలో హాస్పిటల్ వైద్య బృందానికి , డాక్టర్ ప్రవీణ్ గోపాల్‌కి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా క్లింకారకు తమ్ముడు, చెల్లెలు రావడంతో అక్కగా ప్రమోషన్ వచ్చిందంటూ మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
మరోవైపు ఈ వార్త తెలియగానే టాలీవుడ్ సెలబ్రెటీలంతా సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ ,,చరణ్-ఉపాసనకు డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ శుభాకాంక్షలు తెలుపగా, అల్లు అర్జున్ ..బాబు+పాప = డబుల్ మెగా పవర్ అని తన ప్రేమను చాటుకున్నారు.అల్లు అరవింద్, లావణ్య త్రివిక్రమ్ వంటి కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున వంటి దిగ్గజ హీరోలతో పాటు సమంత, తమన్నా వంటి హీరోయిన్లు కూడా మెగా వారసులకు శుభాకాంక్షలు చెప్పారు . రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు మెగా ఫ్యామిలీ ఇప్పుడు పరిపూర్ణమైందని ట్వీట్స్ చేశారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ వంటి ప్రముఖులు రామ్ చరణ్ ఫ్యామిలీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వార్తకు 10 లక్షల పైచిలుకు లైక్స్ రావడమే కాకుండా, #MegaTwins హ్యాష్ ట్యాగ్.. ఇండియా వైడ్ ట్రెండింగ్‌లో పరుగులు పెడుతుంది.
