Nani
నేచురల్ స్టార్ నాని మరోసారి తన స్టైలిష్ ప్రెజెన్స్‌తో సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ లుక్‌ను మూవీ టీమ్ తాజాగా విడుదల చేసింది.
గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన దసరా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
ఈసారి నాని పోషిస్తున్న రోల్ పేరు జడల్ అని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
His Name/వాడి పేరు
‘Jadal’
‘జడల్’Calling a spade a spade. #THEPARADISE @odela_srikanth @anirudhofficial @SLVCinemasOffl @Dop_Sai @NavinNooli @artkolla @kabilanchelliah pic.twitter.com/gN3i0fPxv7
— Nani (@NameisNani) August 8, 2025
ఒక అల్లికగా మొదలై, విప్లవంగా ముగిసిన కథ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌లోని ట్యాగ్‌లైన్ చెప్పినంతనే ప్రేక్షకుల కుతూహలాన్ని రెట్టింపు చేసింది. పోస్టర్‌లో నాని రెండు జడలతో, గంభీరమైన ఎక్స్‌ప్రెషన్‌లో కనిపిస్తూ, పాత్రలోని రఫ్ అండ్ ఇంటెన్స్ వైబ్‌ను స్పష్టంగా చూపించాడు.
సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. నాని కొత్త లుక్‌కి నెట్‌జన్లు పాజిటివ్ రివ్యూలు ఇస్తూ, ది ప్యారడైజ్(The Paradise) రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు. ఈ మూవీ, నాని కెరీర్‌లో మరో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.