Pawan: సార్ మీరు పవన్ కాదు..తుపాన్: సిద్దు జొన్నలగడ్డ పోస్ట్‌ వైరల్

Pawan: ఓజీపై విడుదలైన ప్రతి అప్‌డేట్ కూడా ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తూ, సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది.

Pawan

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఒకటే పేరు, అదే పవన్ కళ్యాణ్(Pawan) నటిస్తున్న ‘ఓజీ(OG). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రంపై అభిమానులకు మాత్రమే కాకుండా,టోటల్ సినీ ఇండస్ట్రీలో కూడా ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. విడుదలైన ప్రతి అప్‌డేట్ కూడా ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తూ, సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు కూడా ఈ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవ్వలేదంటే అతిశయోక్తి కాదు.

ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపిస్తూ, యువ హీరో సిద్దు జొన్నలగడ్డ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘ఓజీ’ సినిమాపై ఉన్న అంచనాలు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ ఓజీ సినిమా హైప్ ప్రభావం మా ఆరోగ్యంపై పడేలా ఉంది. 25వ తేదీ వరకైనా ఉంటామో, పోతామో అర్థం కావడం లేదు. ఇప్పుడే ఇలా ఉందంటే, 25వ తేదీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో? అంటూ సిద్దు తన ఆందోళనను సరదాగా వ్యక్తం చేశారు. “సార్ మీరు పవన్(Pawan) కాదు.. తుపాన్” అంటూ పవన్‌ కళ్యాణ్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

కేవలం సిద్దు మాత్రమే కాదు, టాలీవుడ్‌లోని యువ హీరోలు అడివి శేష్, మంచు మనోజ్, తేజ సజ్జా, బెల్లంకొండ శ్రీనివాస్ వంటివారు కూడా ఓజీ గురించి బహిరంగంగా మాట్లాడటం ఈ సినిమాకు హైప్‌ను పెంచేశారు. సినీ పరిశ్రమలో ఏ వేడుక జరిగినా, ఏ ఇంటర్వ్యూలోనైనా ‘ఓజీ’ ప్రస్తావన రావడం కామన్ అయిపోయింది. ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, ఇతర ప్రోమోషనల్ మెటీరియల్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే, ఇది బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఓజీ’ కేవలం ఒక సినిమా కాదు, అది ఒక సంచలనం అని చాలామంది అభివర్ణిస్తున్నారు.

Pawan

పవన్ కళ్యాణ్(Pawan) స్టైల్, సుజీత్ దర్శకత్వంలో ఉండే యాక్షన్, ఈ రెండూ కలిస్తే అది థియేటర్లలో ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా సరే కూడా ఇప్పుడే ఈ రేంజ్‌లో హైప్ ఉండటం, సినిమా పరిశ్రమలో పవన్(Pawan) సినిమాపై ఉన్న నమ్మకాన్ని, అంచనాలను తెలియజేస్తుందంటున్నారు ఫ్యాన్స్.

Pani puri: ఎవరమ్మా తల్లీ నువ్వు ? పానీపూరి కోసం నడిరోడ్డుపై ధర్నా

Exit mobile version