Bigg Boss
బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం సందడి ముగిసింది. కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యుల మధ్య తీవ్రమైన పోటీ, వాగ్వాదాలు జరిగాయి. చివరికి, పవన్ ఇంటి కొత్త కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అయితే ఈ మొత్తం ప్రక్రియలో చాలా నాటకీయత, కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి.
రెండో వారంలో, ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఓనర్స్ , టెనెంట్స్. కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేయడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. టెనెంట్స్ టీమ్ కలిసి ఓనర్స్ టీమ్ నుంచి ముగ్గురు కంటెండర్లను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఆ టీమ్ నుంచి భరణి, మనీష్, పవన్ కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించారు. ఆ తరువాత, ఈ ముగ్గురు కంటెండర్లు కలిసి టెనెంట్స్ టీమ్ నుంచి ఇమ్ముని నాల్గవ కంటెండర్‌గా ఎంపిక చేసుకున్నారు.
కెప్టెన్సీ కోసం నలుగురు కంటెండర్లకు బిగ్ బాస్ ‘రంగు పడుద్ది’ అనే ఆటను ఇచ్చారు. ఈ ఆటలో కంటెండర్లు ఒకరిపై ఒకరు రంగు పోసుకోవాలి. చివరికి ఎవరి టీషర్టు మీద తక్కువ రంగు ఉంటుందో వారే విజేత. ఈ ఆటలో రీతూ సంచాలక్‌గా వ్యవహరించింది. ఆట ప్రారంభం నుంచే తీవ్రమైన పోటీ కనిపించింది. మొదటి రౌండ్‌లో మనీష్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్‌లో భరణిని రీతూ ఆట నుంచి తప్పించింది, అతను నిబంధనలు పాటించలేదని ఆరోపించింది.
ఈ ఆట జరుగుతున్నప్పుడు, ఇంటి సభ్యులు ప్రియ , శ్రీజల ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. వారు ఈ పోటీని ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మనీష్ , పవన్ సెలబ్రిటీల వర్గంగా, భరణి , ఇమ్ము కామనర్స్ వర్గంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారని విమర్శించారు. అయితే, ఆట ముగిసిన తర్వాత పవన్ గెలవగానే, శ్రీజ, ప్రియలు సంతోషంతో గంతులు వేయడం గమనార్హం. ఇది వారి వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉంది.
ఆట చివరి వరకు పవన్, ఇమ్ము మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరికి, పవన్ ఈ టాస్క్‌లో విజయం సాధించి, రెండో వారానికి బిగ్ బాస్(Bigg Boss) ఇంటి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. తన విజయం తర్వాత, అతని స్నేహితులు, టీమ్ సభ్యులు సంతోషంగా ఉన్నారు. మరి పవన్ కెప్టెన్‌గా తన బాధ్యతలను ఎలా నిర్వహిస్తాడో, ఈ గ్రూప్ రాజకీయాలను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
http://Aadhaar: వాట్సాప్‌లోనే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?