Power Star:నిర్మాతగా పవర్ స్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారా? ఈ క్రేజీ అప్‌డేట్ ఏం చెబుతోంది?

Power Star:చాలా ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై 'సర్దార్ గబ్బర్ సింగ్', 'చల్ మోహన్ రంగ' వంటి సినిమాలను నిర్మించారు.

Power Star

మెగా పవర్ స్టార్(Power Star), ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయ బాధ్యతలను, ఇటు సినిమా కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ‘ఓజీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన పవన్ .. త్వరలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , ‘ఓజీ 2’ వంటి భారీ చిత్రాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు.

అయితే, తాజాగా పవన్(Power Star) చేసిన ఒక ప్రకటన ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్ సమయంలోనే పవన్ తాను భవిష్యత్తులో నటుడిగా కొనసాగుతానో లేదో తెలీదు కానీ..ప్రొడ్యూసర్‌గా మాత్రం కచ్చితంగా సినిమాలు చేస్తానని హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిజం చేస్తూ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అకౌంట్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడం హాట్ టాపిక్ అయింది.

Power Star

చాలా ఏళ్ల క్రితమే పవన్ ఈ బ్యానర్ పై ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘చల్ మోహన్ రంగ’ వంటి సినిమాలను నిర్మించారు. కానీ ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ప్రొడక్షన్ మీద పెద్దగా దృష్టి పెట్టడానికి అవలేదు. ఇప్పుడు మళ్లీ ఈ సంస్థను పట్టాలెక్కించి, కొత్త తరహా స్టోరీలను ప్రోత్సహించాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ బ్యానర్ కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అధికారికంగా బయటకు రావడంతో, పవన్ ప్రొడ్యూసర్‌గా చేయబోయే తదుపరి చిత్రాల్లో ఏ హీరోలు ఉంటారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తనకున్న మార్కెట్ ,క్రేజ్ తో మెగా హీరోలతో పాటు ఇతర యంగ్ ట్యాలెంట్‌ను కూడా ఆయన ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. కేవలం లాభాల కోసమే కాకుండా, క్వాలిటీ ఉన్న సినిమాలను ఆడియన్స్‌కు అందించాలన్నదే ఆయన సంకల్పంలా కనిపిస్తోందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ అప్‌డేట్‌తో పాటు పవన్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న మరో విషయం ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం గురించి న్యూస్ బయటకు రావడమే. ‘ఓజీ’ షూటింగ్ సమయంలో పవన్ జజమళ్లీ తన పాత మార్షల్ ఆర్ట్స్ మెళకువలను బయటకు తీశారు. దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో జర్నీని విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పవన్ (power star) మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన పడిన కష్టం, ట్రైనింగ్ , దానిపై ల ఆయనకున్న అంకితభావాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో కొత్త ప్రయాణం మొదలవబోతోందని ఆయన ప్రకటించడంతో, ఇది కేవలం సినిమా కోసమేనా లేక ఏదైనా అకాడమీ స్థాపించే ఆలోచనా అనే చర్చ కూడా సినీ వర్గాలలో మొదలైంది.

NTR-Neel :ఎన్టీఆర్-నీల్ మూవీలో ‘డ్రాగన్’ తాండవం.. హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్

Exit mobile version