IMDb list
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం తెలుగు సినీ తారల హవా నడుస్తోందని మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా విడుదలైన IMDb జూలై నెల అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్లు జాబితా మళ్లీ దీనిని నిరూపించింది. ఈ జాబితాలో డార్లింగ్ ప్రభాస్ తిరుగులేని ఆధిక్యతను కొనసాగిస్తుండగా, వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా దూసుకువచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఈ (IMDb list) జాబితాలో మొదటి స్థానంలో .. వరుసగా కొన్ని నెలలుగా అగ్రస్థానంలో తన పట్టును నిలుపుకుంటున్న డార్లింగ్ ప్రభాస్ (Prabhas)మరోసారి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాన్-ఇండియా స్థాయిలో ఆయనకు ఉన్న అపారమైన క్రేజ్, అభిమానుల ఫాలోయింగ్‌కు ఈ స్థానం నిదర్శనంగా నిలిచింది. ఆయన రేంజ్ ఏంటో ఈ జాబితా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
ఈ (IMDb list) జాబితాలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పదవ స్థానంలోకి అనూహ్యంగా దూసుకు రావడం. అంతకుముందు నెలలో ఈ స్థానం నానికి ఉండగా, పవన్ తన క్రేజ్‌తో టాప్ 10లోకి ప్రవేశించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం “హరి హర వీరమల్లు”పై దేశవ్యాప్తంగా ఉన్న అంచనాలే దీనికి ప్రధాన కారణమని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అలాగే IMDb లిస్టులో ఈ అగ్రతారల పక్కన, రెండవ స్థానంలో తమిళనాడుకు చెందిన అగ్ర కథానాయకుడు విజయ్ నిలవగా, మూడవ స్థానంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నిలిచారు. ఆ తర్వాత, నాలుగో స్థానాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కైవసం చేసుకున్నారు. మహేష్ బాబు ఆరవ స్థానంలో, జూనియర్ ఎన్టీఆర్ ఏడవ స్థానంలో, రామ్ చరణ్ ఎనిమిదవ స్థానంలో నిలిచి, తెలుగు చిత్ర పరిశ్రమ స్టార్ పవర్‌ను నిరూపించారు.