Raju Weds Rambai: ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి.. అంతేకాదు ఎక్స్‌ట్రా ట్రీట్ కూడా

Raju Weds Rambai: అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరోహీరోయిన్లుగా నటించిన రాజు వెడ్స్ రాంబాయిలో విలన్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ మెప్పించాడు.

Raju Weds Rambai

ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సెన్సేసన్ హిట్ సాధించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Rambai) ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ విలేజ్ ప్రేమ కథా చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇందులో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరోహీరోయిన్లుగా నటించారు, విలన్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ మెప్పించాడు.

ప్రేక్షకుల మనసులను కదిలించిన ఈ హార్ట్ టచింగ్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా హక్కుల్ని ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకోగా, డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “థియేటర్స్‌లో మోత మోగించాం.. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మోత మోగించడానికి కూడా వస్తున్నాం విత్ డాల్బీ అట్మాస్ సౌండ్ అండ్ విజన్ తో” అని క్యాప్షన్ జత చేశారు.

Raju Weds Rambai

అంతేకాకుండా మరో సర్‌ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీని ఎక్స్‌టెండెడ్ కట్ రూపంలో ఓటీటీలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సినిమా థియేటర్ రన్‌టైన్ 2 గంటల 15 నిమిషాలు కాగా, ఓటీటీలో మాత్రం మరికొన్ని అదనపు సన్నివేశాలను జోడించి స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నారని సమాచారం. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version