Rashi:శివాజీ,అనసూయ మధ్యలో రాశి..నెక్స్ట్ ఎవరు? ..సారీతో శుభం కార్డు పడేనా?

Rashi: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న పొరపాటు ఎప్పటికైనా బయటకు వస్తుందని అనసూయ ఘటన మరోసారి నిరూపించింది.

Rashi

తెలుగు బుల్లితెర , వెండితెరపై కొద్దిరోజులుగా ఒకే అంశం హాట్ టాపిక్ గా నడిచింది. నటుడు శివాజీ చేసిన వస్త్రధారణ వ్యాఖ్యలతో మొదలైన మంట, అనసూయ భరద్వాజ్ కౌంటర్ తో మరింత పెరిగి, చివరకు సీనియర్ నటి రాశి(Rashi) కామెంట్లతో పాత వివాదాన్ని తెరపైకి తెచ్చింది.

మూడేళ్ల క్రితం ఒక కామెడీ షోలో రాశిని ఉద్దేశించి అనసూయ చేసిన డబుల్ మీనింగ్ కామెంట్లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడటంతో.. అనసూయ తాజాగా రెస్పాండ్ అవక తప్పలేదు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా రాశికి బహిరంగంగా క్షమాపణలు చెబుతూ ఆమె సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. అయితే, ఈ క్షమాపణ వెనుక ఉన్న కారణాలు , దానికి దారితీసిన పరిస్థితులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

అనసూయ తన క్షమాపణ పోస్టులో అప్పట్లో ఆ డైలాగులను దర్శకులు, రచయితలు బలవంతంగా చెప్పించారని, ఆ సమయంలో వారిని నిలదీసే శక్తి తనకు లేదని అన్నారు. తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో ఆ డైలాగ్ చెప్పడం పొరపాటే.. నన్ను క్షమించండని ఆమె రాశారు. తాను ఆ తర్వాత అటువంటి షోల నుంచి తప్పుకోవడమే తనలోని మార్పుకు నిదర్శనమని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే, అంతకుముందే రాశి స్పందిస్తూ.. ఒక మహిళ అయ్యుండి తోటి మహిళను బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు సమంజసం? నేను అక్కడ ఉండి ఉంటే ఆ రోజే నిలదీసేదాన్ని అని చేసిన రాశి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఒక పక్క మహిళా హక్కుల గురించి మాట్లాడుతూనే, మరోపక్క తోటి నటిని కించపరిచేలా వ్యవహరించడంపై నెటిజన్లు ఆమెను నిలదీశారు.

ఈ వివాదంలో సొసైటీ ,నెటిజన్ల రియాక్షన్ గమనిస్తే, మెజారిటీ మద్దతు సీనియర్ నటి రాశికే లభించింది. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో గౌరవప్రదంగా ఉన్న ఒక నటి గురించి అశ్లీల జోకులు వేయడం కామెడీ అనిపించుకోదని చాలామంది అన్నారు. అయితే శివాజీ వివాదాన్ని పక్క దోవ పట్టించడానికే ఇలాంటి వివాదాలు రేపుతున్నారని అనేవాళ్లు కూడా ఉన్నారు.

గతంలో కూడా ఇలాంటి వివాదాలు ఇండస్ట్రీలో చాలానే జరిగాయి. కామెడీ షోల పేరుతో బాడీ షేమింగ్ చేయడం, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను వెక్కిరించడం వంటివి సాధారణమైపోయాయి. అయితే తాజాగా అనసూయ క్షమాపణ చెప్పడం మంచి పరిణామమే అయినా, ఇది కేవలం ట్రోలింగ్ భయంతోనే చేసిందా లేక నిజంగానే పశ్చాత్తాపంతో చేసిందా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

Rashi

ప్రస్తుతానికైతే ఈ వివాదానికి అనసూయ క్షమాపణతో ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. కానీ, సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న పొరపాటు ఎప్పటికైనా బయటకు వస్తుందని అనసూయ ఘటన మరోసారి నిరూపించింది.

మొత్తంగా శివాజీ నుంచి మొదలైన ఈ రచ్చ అనసూయ, రాశి(Rashi), చివరకు అన్వేష్ వంటి వారి వరకు చేరి పెద్ద గందరగోళంగా మారినా, చివరికి మహిళా గౌరవం విషయంలో ఎప్పుడూ, ఎవరూ కూడా రాజీ పడకూడదనే సందేశాన్ని సొసైటీకి ఇచ్చింది. మరి ఇప్పుడైనా ఈ వివాదాలు చల్లారుతాయా లేక కొత్త మలుపు తీసుకుంటాయా అన్నది వేచి చూడాలి.

 

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version