Animated series: 9.1 రేటింగ్ తో రికార్డులు..మహావతార్ నరసింహ’కు ఏమాత్రం తగ్గని యానిమేటెడ్ సిరీస్

Animated series: హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ యానిమేటెడ్ మూవీ థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యపరిచింది.

Animated series

మహావిష్ణువు నాలుగవ అవతారం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ఏ మాత్రం తగ్గని మరో అద్భుతమైన యానిమేటెడ్ సిరీస్(Animated series) ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది.

Tirumala :శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆరోజు తిరుమల ఆలయం మూసివేత!

ప్రస్తుతం ఓటీటీలో అత్యుత్తమ యానిమేటెడ్ సిరీస్‌గా ప్రశంసలు పొందుతున్న ఈ సిరీస్ పేరు ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ మొత్తం హనుమంతుడి సాహసాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా, ‘మహావతార్ నరసింహ’ తరహాలో ఈ సిరీస్‌లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.

 

ఈ సిరీస్ మొదటి సీజన్ 2021లో రిలీజ్ కాగా, ఇప్పటివరకు మొత్తం ఆరు సీజన్లు స్ట్రీమింగ్ అయ్యాయి. ఐఎమ్‌డీబీ (IMDb)లో ఈ సిరీస్‌కు ఏకంగా 9.1/10 రేటింగ్ లభించడం దీని నాణ్యతకు నిదర్శనం. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు విడుదలైన ఆరు సీజన్లకు అద్భుతమైన స్పందన లభించడంతో, మేకర్స్ ఏడవ సీజన్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే ఒక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.

Animated series

మొత్తంగా, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సిరీస్‌లో ఆరు సీజన్లలో 52 ఎపిసోడ్‌లు ఉన్నాయి. తెలుగులో కూడా అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌ను ‘మహావతార్ నరసింహ ఓటీటీలోకి వచ్చే వరకు చూసేయండి!

Exit mobile version