Samantha
టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సమంత. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సామ్..రంగస్థలం, మజిలీ, ఓ బేబీ, శాకుంతలం వంటి వైవిధ్యభరితమైన సినిమాలతో స్టార్‌డమ్‌ను అందుకున్నారు.
కేవలం నటనతోనే కాకుండా, తన అభిరుచికి అనుగుణంగా సినిమాలను ఎంచుకుని, వాటికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. శుభం అనే హర్రర్ కామెడీ సినిమాను తన నిర్మాణ సంస్థలో నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నారు.
ATM: ఏటీఎమ్‌లో క్యాన్సిల్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే మీరే సేఫేనా?
ఇప్పుడు సమంత(Samantha) తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారని పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె నటిగా, నిర్మాతగా ఉన్న అనుభవాన్ని ఉపయోగించి, త్వరలో దర్శకురాలిగా అరంగేట్రం చేయనున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి.దీంతో నటిగా, నిర్మాతగా, ఇప్పుడు దర్శకురాలిగా.. ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టనున్నారంటూ సామ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
సమంత తన మొదటి సినిమాను ఒక క్యూట్ లవ్ స్టోరీతో తెరకెక్కించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఆమె ‘ఏ మాయ చేసావే’ సినిమాతో లవర్ గర్ల్‌గా గుర్తింపు పొందింది. ఆ సినిమా ప్రేమకథనే మళ్లీ ఇప్పుడు దర్శకురాలిగా తెరపైకి తీసుకురాబోతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ లవ్ స్టోరీకి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఆమె కొత్త నటీనటులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. నటిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన సమంత, దర్శకురాలిగా కూడా ఒక సరికొత్త కోణంలో ఈ ప్రేమకథను చూపించబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ వార్తలు సమంత (Samantha) అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’, ‘హనీ బన్నీ’ వంటి అంతర్జాతీయ వెబ్ సిరీస్‌లలో యాక్షన్ పాత్రలు పోషించి మెప్పించిన సమంత, ఇప్పుడు దర్శకురాలిగా తనదైన ముద్ర వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
అయితే, ఈ వార్తలు కేవలం ఊహాగానాలేనా లేక నిజమా అన్నది తెలియాలంటే అధికారికంగా సమంత కానీ, ఆమె టీమ్ కానీ ప్రకటన చేయాల్సి ఉంది. అప్పటివరకు, సమంత అభిమానులు ఆమె కొత్త ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె ఏ మాత్రం కొత్తదనం చూపించబోతున్నారో, ఎలాంటి నటీనటులను ఎంపిక చేసుకుంటారో చూడాలి.