Samantha:సంక్రాంతికి సమంత సడన్ సర్ ప్రైజ్..ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

Samantha:మీరు చూస్తూ ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుందంటూ సమంత తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Samantha

టాలీవుడ్ వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించుకున్న సమంత(Samantha), చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో సవాళ్లు,మరోవైపు ఆరోగ్య సమస్యల వల్ల కొంతకాలం వెండితెరకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు డబుల్ ఎనర్జీతో రీ-ఎంట్రీ ఇస్తోంది.

సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) నుంచి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

జనవరి 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేయనున్నారు. మీరు చూస్తూ ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుందంటూ సమంత(Samantha) తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Samantha

గతంలో సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ..ఓ బేబీ మూవీ ఎంత ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. మళ్లీ అదే మేజిక్ రిపీట్ అవుతుందని, అదే సెంటిమెంట్ వర్కవుట్ అవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా సమంత(Samantha) తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ (Tralala Moving Pictures) బ్యానర్‌పైన ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తుండటంతో దీనిపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

ఈ మూవీ స్టోరీ లైన్ గురించి టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇది 1980ల నాటి కాలం నాటి కథ అని, ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ గుల్షన్ దేవయ్య ఇందులో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారట.

సమంతను మళ్లీ స్క్రీన్ మీద చూడాలని తహతహలాడుతున్న ఫ్యాన్స్‌కు ఈ సంక్రాంతి టీజర్ అప్‌డేట్.. నిజంగానే పెద్ద పండుగ అనే చెప్పాలి. పోస్టర్‌లో సమంత లుక్ చూస్తుంటే, ఈసారి ఆమె ఏదో వైవిధ్యమైన రోల్‌తో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ తన సత్తా చాటబోతుందని క్లియర్ గా అర్థమవుతోంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Exit mobile version