Movie Ticket Price
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల (Movie Ticket Price ) పెంపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య అగ్గిరాజేసింది. వీరిద్దరి మధ్య చక్రం తిప్పుతూ రోహిన్ రెడ్డి అనధికార సినిమాటోగ్రఫీ మంత్రిగా అజమాయిషీ చెలాయిస్టున్నట్టు తెలుస్తోంది.
తాజాగా కోమటిరెడ్డి కామెంట్స్ దీనికి నిదర్శనం. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల (Movie Ticket Price ) పెంపు వ్యవహారం కోర్టుకు చేరడం, న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మీడియా నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి స్పష్టంగా జవాబిచ్చే క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిని కాదనీ,. సినిమాలు గురించి పట్టించుకోవడం లేదన్నారు, తనకు సినిమా టికెట్ల రేట్ల పెంపుతో సంబంధం లేదని కుండబద్దలుకొట్టేశారు.
సినిమా టికెట్ రేట్లు ( Movie Ticket Price ) పెంచనని ఎప్పుడో చెప్పేసాననీ, . పుష్ప 2 తొక్కిసలాట ఘటనతో ప్రీమియర్ షోలు ,బెనిఫిట్ షోలు వేయకూడదని, టికెట్ రేట్లుపెంచకూడదని నిర్ణయించాయమన్నారు. .దానికే కట్టుబడి ఉన్నానంటూ ఆయన స్పష్టం చేశారు.
మరి టికెట్ల రేట్ల పెంపు నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారన్న చర్చ మొదలైంది.
ఆ శాఖను ఇంకెవరో అనధికారికంగా టేక్ ఓవర్ చేసేసారని…. సమాంతర వ్యవస్థ నడుపుతున్నారని, వాళ్లే అన్ని నిర్ణయాలు చేస్తున్నారని సమాచారం. సీఎంవో కార్యాలయం సహకారంతో రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ గా చెప్పుకునే రోహిన్ రెడ్డి సినిమా వాళ్ళ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారనేది ఓపెన్ టాక్. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. తన శాఖలో…. తనకు సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి కీలక నిర్ణయాలు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ ఉక్రోషాన్ని పరోక్షంగా బయటపెడుతున్నారు.
ఇప్పటికే విడుదలైన రాజాసాబ్ సినిమాకి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షో లు, టికెట్లు రేట్లు (Movie Ticket Price ) పెంపుపై…. మంత్రి కోమటిరెడ్డి చివరి నిమిషం వరకు నిర్ణయం తీసుకోలేదు. అయితే రాత్రి 11తర్వాత రోహిన్ రెడ్డి సూచనలతో అనుమతి వచ్చింది.దీంతోసినిమా వాళ్లు సంబంధిత మంత్రి తో సంబంధం లేకుండా, ఎలా ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టాలీవుడ్ నిర్మాతలు రోహిన్ రెడ్డి ద్వారా, సిఎంఓ లో తమ పనులు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.
Greenland:గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్ను.. ఇటాలియన్ ప్రధాని మెలోని స్ట్రాంగ్ కౌంటర్
