Devara 2: దేవర 2 అందుకే ఆగిపోయిందా?

Devara 2: సరిగ్గా ఈ టైంలోనే దేవర 2 ఆగిపోయిందనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Devara 2

డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన దేవర.. సెప్టెంబర్ 27, 2024న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. లాక్‌డౌన్ తర్వాత అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన ఏకైక తెలుగు సినిమాగా దేవర రికార్డ్ క్రియేట్ చేసింది. RRR, సలార్, కల్కి 2898AD, పుష్ప 2 వంటి భారీ చిత్రాలు కూడా సాధించలేని ఈ ఫీట్‌ను దేవర అందుకుంది. సరిగ్గా ఈ టైంలోనే దేవర 2 ఆగిపోయిందనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి మెయిన్ రీజన్ కొరటాల శివ, నాగచైతన్యతో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారన్నదే.

నిజానికి, నాగచైతన్య నెక్స్ట్ మూవీస్ గురించి చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో #NC24 సినిమా చేస్తున్న చైతన్య, ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే క్లారిటీ లేదు. మొదట మజిలీ ఫేమ్ శివ నిర్వాణ, ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా అని న్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి కొరటాల శివ(Koratala Siva) పేరు యాడ్ కావడంతో, దేవర 2 ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ న్యూస్‌ని నమ్మవద్దని ఎన్టీఆర్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో స్వయంగా ‘దేవర 2’ కచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చారు.

Devara-2

దేవరలో ఎన్టీఆర్‌(NTR)కు జతగా జాన్వీ కపూర్ నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా యాక్ట్ చేశారు. సినిమా స్టోరీ, నరేషన్ పై కొన్ని క్రిటిక్స్ వచ్చినా, ఫ్యాన్స్ సినిమాకు పాజిటివ్ టాక్‌ను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా రూరల్ ఏరియాస్‌లోని మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ సాధించింది. పార్ట్ 1లో స్టోరీ పెద్దగా లేకపోవడంతో, మెయిన్ స్టోరీ పార్ట్ 2లోనే ఉంటుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. దీంతో దేవర 2(Devara 2)పై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే భారీ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘మురుగ’ అనే మైథలాజికల్ మూవీ చేయబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుల వల్ల ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో, దేవర 2 (Devara 2) సెట్స్‌పైకి రావడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్‌లో కొరటాల శివ నాగచైతన్యతో సినిమా చేయాలని ప్లాన్స్ వేసుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ తన డ్రాగన్ ఫుల్ అవగానే, మురుగ కంటే ముందుగా దేవర 2ని ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని న్యూస్. కాబట్టి దేవర 2(Devara 2) తప్పకుండా ఉంటుంది కాబట్టి.. ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు.

Also Read: Gold price: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ సమయంలో గోల్డ్ కొనొచ్చా?

Exit mobile version