Dekh Lenge Saala
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లేంగే సాలా (Dekh Lenge Saala)’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట విడుదలైన వెంటనే ఫ్యాన్స్ (Fans) నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు.
గతంలో గబ్బర్ సింగ్ (Gabbar Singh) లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు (Huge Expectations) నెలకొన్నాయి. అంతేకాకుండా, ‘ఓజీ (OG)’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి.
తాజాగా విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాటను విడుదల చేయడానికి రాజమండ్రిలో ప్రత్యేకమైన ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ పాట నెక్స్ట్ లెవల్లో ఉందని, పవన్ కళ్యాణ్ డాన్స్ (Dance) కేక పుట్టిస్తుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
దేఖ్ లేంగే సాలా(Dekh Lenge Saala) పాటను విశాల్ డడ్లాని పాడారు. ఈ పాట వినడానికి చాలా మోటివేషన్‌గా (Motivation) అనిపిస్తోంది. ఈ పాటను భాస్కరభట్ల రాశారు. ఈ సినిమా గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్, పవన్ అభిమానులు అంటున్నారు.
