YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కనిపించని పశ్చాత్తాపం..నెటిజన్ల ఆగ్రహం

YouTuber Anvesh: అన్వేష్ ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఏ ఐపీ అడ్రస్ వాడుతున్నాడనే వివరాల కోసం వెయిట్ చూస్తున్నారు.

YouTuber Anvesh

ప్రపంచం చుట్టే వ్లాగర్‌గా పేరు తెచ్చుకున్న ‘నా అన్వేషణ’ చానెల్ నిర్వాహకుడు అన్వేష్(YouTuber Anvesh) మరింత చిక్కుల్లో పడ్డాడు. కేవలం ట్రావెల్ వీడియోలతో ఆగకుండా, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అశ్లీల సంకేతాలు ఇవ్వడం వంటి చేష్టలు ఇప్పుడు అతడిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తున్నాయి. పంజాగుట్ట పోలీసులు అన్వేష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

అన్వేష్‌(YouTuber Anvesh)పై నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఏపీ , తెలంగాణ వ్యాప్తంగా కంప్లైట్ల మీద కంప్లైంట్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అన్వేష్ వ్యక్తిగత వివరాలు, యూజర్ ఐడీ వివరాలు కోరుతూ పంజాగుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు లెటర్ రాశారు. అన్వేష్(YouTuber Anvesh) ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఏ ఐపీ అడ్రస్ వాడుతున్నాడనే వివరాల కోసం వెయిట్ చూస్తున్నారు. ఈ వివరాలు అందగానే అతనికి నోటీసులు జారీ చేస్తామని.. ఒకవేళ స్పందించకపోతే ‘లుక్ అవుట్’ నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేస్తామని సీఐ రామకృష్ణ స్పష్టం చేశారు.

ఒకవైపు తనపై వరుసు కేసులు నమోదవుతుంటే, అన్వేష్ అవేమీ పట్టనట్లుగా మలేషియాలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వీడియోను పోస్ట్ చేశాడు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ మలేషియా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఈ వీడియో కింద కామెంట్స్ డిసేబుల్ చేశాడు. ఈ వీడియో చూసిన జనం మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసినా పశ్చాత్తాపం లేకుండా మలేషియాలో ఎంజాయ్ చేస్తున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు.

YouTuber Anvesh

అన్వేష్(YouTuber Anvesh) హిందువులు ఆరాధించే సీత, ద్రౌపదిల పట్ల అభ్యంతరకర రీతిలో మాట్లాడటం ఈ వివాదానికి మెయిన్ రీజన్. అలాగే గరికిపాటి వంటి ప్రవచనకారులపై బూతుపదాలు వాడుతూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు. అలాగే ప్రతి దేశంలోనూ ఒక ‘లోకల్ వైఫ్’ను సెట్ చేసుకోవడం, అదే కరెక్ట్ అనేలా అశ్లీల సంస్కృతిని ప్రోత్సహించడంపైన కూడా అన్వేష్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే ఒక ఆడియో క్లిప్పింగ్‌లో 14 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణలతో అతడిపై పోక్సో చట్టం కింద కూడా చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు జనవరి 2వ తేదీ మధ్యాహ్నం నాటి రియల్ టైమ్ డేటా ప్రకారం..యూట్యూబ్: 2.8 మిలియన్ల నుంచి 2.23 మిలియన్లకు పడిపోయింది.
ఇన్‌స్టాగ్రామ్: 1.8 మిలియన్ల నుంచి 1.35 మిలియన్లకు పడిపోయింది. అంటే సుమారు 5.7 లక్షల మంది నిరసనగా యూట్యూబ్ అన్‌సబ్‌స్క్రైబ్ చేయగా.. ఇన్‌స్టాగ్రామ్ లో 4.5 లక్షల మంది ఫాలోవర్స్ తగ్గారు. మొత్తంగా చూస్తే 10.2 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ అన్వేష్‌ను బహిష్కరించారు. ముందు 26 లక్షల మంది అని వార్తలు వచ్చినా మొత్తం 10.2 లక్షల మంది బ్యాన్ చేసినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి..

మొత్తంగా చేతిలో ఫోన్, సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే సొసైటీ ఊరుకోదని అన్వేష్ ఉదంతం నిరూపిస్తోంది. కంటెంట్ క్రియేటర్‌ను నెత్తిన పెట్టుకునేది.. తప్పు చేస్తే కిందకు పడేసేది కూడా ఈ ఫాలోవర్స్, ఫ్యాన్సే అని ఈ అన్‌సబ్‌స్క్రైబ్ వేవ్ స్పష్టం చేస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version