War 2 :వార్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక వార్ షురూ..

War 2 : బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్ 2'

War 2 : బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ ట్రైలర్ రిలీజై సినీ ప్రియుల అంచనాలను ఆకాశానికి చేర్చింది. 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్న సమయంలో, మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసి అభిమానులకు పండగ వాతావరణాన్ని సృష్టించారు.

War 2

గతంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘వార్ 2’ను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండటంతో, మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది, ఆయన పాత్రపై ఊహాగానాలకు తెరలేపింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త అందిస్తూ, చిత్ర బృందం ‘వార్ 2’ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ను హిందీతో పాటు తెలుగు, తమిళం భాషలలోనూ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సన్నివేశాలకు వచ్చిన ఎలివేషన్స్ అన్నీ వేరొక స్థాయికి చెందినవిగా ఉన్నాయి. వారిద్దరి మధ్య భారీ యాక్షన్ ఘట్టాలు, అదిరిపోయే డైలాగులు, గ్రిప్పింగ్ స్టోరీలైన్‌ను ట్రైలర్ సూచిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.

YRF (యష్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు సహజంగానే అధికంగా ఉన్నాయి. యాక్షన్ ఎలిమెంట్స్, అగ్ర తారల నటన, మరియు పటిష్టమైన కథాంశం అన్నీ కలిపి ఈ సినిమాకు భారీ హైప్ ఇస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత నాగవంశీ దక్కించుకోవడం తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ‘వార్ 2’ దేశీయ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ ట్రైలర్‌ను ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేయగా రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.

Exit mobile version